Wednesday, March 22, 2023

దరఖాస్తులను అధికారులు నిర్లక్షం చేయవద్దు

- Advertisement -

sit2

మనతెలంగాణ/సూర్యాపేట : ప్రజావాణి కార్యక్రమ ంలో ప్రజల సమస్యలను అధికారులు నిర్లక్షం వహి ం చరాదని,వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆర్జీదారులతోనే ఉండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి ప్రజలు వారి సమస్యలను తెలియజేసేందుకు కార్యాలయానికి వస్తుం టారని ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలను అధికారులు నిర్లక్షం చేయకుండా వెంటనే పరిష్కరించాలని తెలిపారు.అదే విధంగా అధికారులు రాయితీ రుణాలను లబ్ధిదారులకు నేరుగా చేరేందుకు లబ్ధిదారుల చేత బ్యాంకు ఖాతాలను ప్రారంభించేలా సంక్షేమ శాఖ అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. మంజూరు అయిన రాయితీ రుణాలు వెంటనే గ్రౌండింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News