*అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు వెంకటేశ్వర్‌రావు
మనతెలంగాణ/నిజామాబాద్: ఎన్నికల అధికారులుగా నియమింపబ డిన ఓటరు జాబితా తయారీలో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయు తంగా ఉండాని ఓటరు జాబితా పరిశీలకులు బూసాని వెంకటేశ్వర్‌రా వు ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవ రణలో నియమింపబడ్డ ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికా రులతో శనివారం ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓటరు జాబితాను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఎన్ని కల అధికారులు గతంలో ఎన్నికల నిర్వహించిన అనుభవం ఉందని తెలియనిది ఏమి లేదనే దృక్పధంలో పనిచేయవద్దని చెప్పారు. ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు వినూత్నంగా ఎన్నికలు, నిర్వహిస్తు న్నందున ఎన్నికల కమిషనర్ జారీ చేసే గైడెన్సు, సూచనలను తెలుసు కుని ముం దుకుపోవాలని అన్నారు. ఎన్నికల సమర్థ నిర్వహణకు ఓటరు జాబితా ముఖ్యమైనదని ఓటరు జాబితాలో సరిగా నమోదై ఉన్నప్పుడు ఓటరు తన హక్కును వినియోగించుకుంటారని ఓటరు జాబితాలో తప్పులు ఉన్నప్పుడు ఆరోపణలు ఎక్కువగా వస్తాయని ఓటరు జాబితాను సమర్థ వంతంగా ఉండేందుకు కృషి చేయాలన్నారు. ఓటరు నమోదు ప్రత్యేక కాంపెయిన్ కూడ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వాసులు ఇతర దేశాల్లో ఉన్నందున వారందరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 6ఎ అందించి ఓటరు జాబితా ప్రక్రియలో సమగ్ర ఓటరు జాబితాను తయారు చేయాలన్నారు. నగరాలు, పట్టణాల్లో పోలింగ్ స్టేషన్లు కేటా యించారో అవగాహన ప్రచారం చేసే చైతన్యవంతులుగా చేయాలని ఓటర్లు పాత పోలింగ్ స్టేషన్ వచ్చి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ రామ్మోహన్‌రావు మాట్లాడుతూ ఓటు ఆయుధంగా వినియోగించుకోవాలంటే ఓటరు జాబితాలో ఓటరు పేరు నమోదు అయినప్పుడే సాధ్యపడుతుందని, ఇంకా సమయం ఉన్నం దున ఎన్నికల అధికారులు మార్పులు, చేర్పులు తప్పులు లేకుండా చూ డాలని డూప్లికేట్ లేకుండా ఉండాలన్నారు. నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు ఇఆర్‌ఓ, ఎఆర్‌ఓలు కృషి చేయాలని ఆదేశించారు.