Tuesday, November 28, 2023

ధోనీని తక్కువ చేసి చూడొద్దు

- Advertisement -
- Advertisement -

Dhoni

 

లండన్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఇటీవల తరచూ వస్తున్న కథనాలు తనను ఎంతో ఆవేదనకు గురి చేస్తున్నాయని ఇంగ్లండ్ మాజీ సారధి, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు నాసిర్ హుస్సేన్ పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్‌కు లభించిన ఆణిముత్యాల్లో ధోనీ ఒకడని, అలాంటి దిగ్గజ ఆటగాడిపై కొందరూ పనిగట్టుకుని విమర్శలకు దిగడం తనను ఎంతో బాధ కలిగిస్తుందన్నాడు. సుదీర్ఘ కాలంగా భారత క్రికెట్ సేవలు అందించిన ధోనీపై ఇటీవల కాలంలో వరుస విమర్శలు రావడం బాధించే అంశమన్నాడు. ఇక, రిటైర్మెంట్‌కు సంబంధించి ధోనీపై ఒత్తిడి తేవడం మంచిది కాదన్నాడు. ఆట నుంచి ఎప్పుడూ తప్పుకోవాలనే దానిపై అతనికి స్పష్టత ఉందన్నాడు. మరి కొన్నేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడే సత్తా అతనికి ఉందన్నాడు. ఇలాంటి స్థితిలో రిటైర్మెంట్ పేరుతో వేధించడం తనను బాధకు గురి చేస్తోందని హుస్సేన్ వాపోయాడు.

 

Do not underestimate Dhoni
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News