Home జాతీయ వార్తలు దేశ పౌరులు ఆర్మీ దుస్తులు ధరించోద్దు

దేశ పౌరులు ఆర్మీ దుస్తులు ధరించోద్దు

army-dressesఢిల్లీ: పఠాన్ కోట్ ఎయిర్‌బేస్‌పై ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ పౌరులేవరూ ఆర్మీ దుస్తులు ధరించవద్దని ఆర్మీ అధికారులు సూచించారు. దేశ పౌరుల శ్రేయుస్సు కోరే తాము ఈనిర్ణయం తీసుకున్నామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. దేశంలో వ్యాపారులు ఎక్కడ కూడా ఆర్మీ దుస్తులు అమ్మవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఆర్మీ అధికారులు అనుమతితో కంటోన్మెంట్ ప్రాంతంలో మాత్రమే అమ్మకాలు జరపాలని సూచించారు. కానీ సైనికులు పిల్లలు, బంధువులు, స్నేహితులు, కేంద్ర బలగాలు, ప్రైవేట్ ఏజెన్సీలు, మాజీ సైనికులు కూడా ఎట్టి పరిస్థితులలో ఆర్మీ దుస్తులు ధరించవద్దని ఆర్మీ అధికారులు తెలిపారు. ఆర్మీ దుస్తులు ధరిస్తే చట్టరీత్యా నేరమని ఆర్మీ వర్గాలు తెలిపాయి. సోషల్ మీడియా ద్వారా దేశ పౌరులకు అవగాహన కల్పించాలని యువతకు ఆర్మీ వర్గాలు విజ్ఞప్తి చేశాయి.