Friday, March 29, 2024

ఒలింపిక్స్ బెర్త్‌లపై ఆందోళన వద్దు

- Advertisement -
- Advertisement -

Olympic

 

క్రీడాకారులకు ఐఓసి భరోసా

టోక్యో: కరోనా కారణంగా ఒలింపిక్స్ క్రీడలు ఏడాది పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా, క్రీడలు వాయిదా పడడంతో ఇప్పటికే పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారుల్లో కొత్త భయం నెలకొంది. తమ ఒలింపిక్స్ బెర్త్‌లు ఉంటాయా లేదా అనే ఆందోళన పలు దేశాలకు చెందిన క్రీడాకారుల్లో ఏర్పడింది. దీనిపై అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసి) స్పష్టమైన ప్రకటన చేసింది. క్రీడాకారుల బెర్త్‌లకు ఎలాంటి ఢొకా ఉండదని, ప్రస్తుతం అర్హత సాధించిన వారందరికి ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.

దీనిపై ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐఓసి పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఒలింపిక్స్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని, అంత మాత్రాన ఇప్పటికే క్రీడలకు అర్హత సాధించిన వారు దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. క్రీడాకారుల బెర్త్‌లు అలాగే ఉంటాయని, వారే ఒలింపిక్స్‌లో పోటీ పడాల్సి ఉంటుందని ఒలింపిక్స్ కమిటీ తేల్చే చెప్పింది. ఈ విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని చూసి ఏ క్రీడాకారుడు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

సాధన కొనసాగించాలి
మరోవైపు ఒలింపిక్స్ క్రీడలు వాయిదా పడినా క్రీడాకారులు తమ సాధనను కొనసాగించాలని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ సూచించింది. ఇప్పటికే అర్హత సాధించిన ఆటగాళ్లందరూ తమ ప్రాక్టీస్ నిరంతరం కొనసాగిస్తూ ఉండాలని కోరింది. కరోనా మహమ్మరి త్వరలోనే రూపుమాపడం ఖాయమని, త్వరలోనే మళ్లీ మాములు స్థితి నెలకొనడం ఖాయమనే ధీమాను కమిటీ వ్యక్తం చేసింది. కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే ఒలింపిక్స్ సన్నాహకంగా కొన్ని అంతర్జాతీయ పోటీలను నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని కమిటీ హామీ ఇచ్చింది. మరోవైపు జపాన్ ప్రభుత్వం కూడా అసంపూర్తిగా మిగిలి పోయిన నిర్వహణ పనులపై దృష్టి సారించింది. కొన్ని నెలల్లోనే అన్ని పనులను పూర్తి చేసి క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది.

 

Do not worry about the Olympics berth
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News