Home తాజా వార్తలు ఉద్యోగాల భర్తీపై ఆందోళన వద్దు

ఉద్యోగాల భర్తీపై ఆందోళన వద్దు

KTR-HYD

హైదరాబాద్ : తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై ఎటువంటి ఆందోళన చెందవద్దని నిరుద్యోగులకు మంత్రి కెటిఆర్ సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే 1.25 లక్షల ఉద్యోగాలను తప్పకుండా భర్తీ చేస్తామన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ముషీరాబాద్, నారాయణగూడలో మంత్రులు కెటిఆర్ , నాయిని నర్సింహారెడ్డి, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంఎల్‌ఎలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, మాగంటి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. చిక్కడపల్లిలోని కేంద్ర గ్రంథాలయాన్ని పరిశీలించారు. చిక్కడపల్లి గ్రంథాలయానికి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని కెటిఆర్ తెలిపారు. ప్రైవేటు రంగంలో కూడా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు తమవంతు కృషి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Do not worry about the replacement of jobs : KTR