Home సూర్యాపేట గెలుపు కోసం కృషి చేయాలి

గెలుపు కోసం కృషి చేయాలి

mnstr

మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి

మన తెలంగాణ/చింతలపాలెం: టిఆర్‌ఎస్ గెలుపు కోసం ప్రతి ఒకరూ కృషి చేయాలని రాష్ట్ర విద్యుత్, ఎస్సి అభివృద్ధి మంత్రి గుంతకండ్ల జగదిశ్వరెడ్డి, హుజూర్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కాసోజు శంకరమ్మ అన్నారు. మండల పరిధిలోని నక్కగూడెం, పిక్లానాయక్ తండాలో ఎంపిపి భూక్యా ఝామా చోక్లా నాయక్, టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లకావత్ రామారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి, ఇన్‌చార్జి సమక్షంలో సుమారు 500 కుటుంబాలకు చెందిన 1100 మంది కార్యకర్తలను వారు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముఖ్య మంత్రి కేసీఆర్ 14 ఏండ్లు పోరాడి అనేక ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి రాష్ట్ర అభివృద్ధి కోసం 365 పథకాలను ప్రవేశపేట్టిన ఘనత దేశంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కోటి ఎకరాలకు నీరు అందించే లక్షంతో ప్రాజెక్టుల నిర్మాణం చేట్టిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధం గా భూ రికార్డు శుద్ధీకరణ చేసి భూ సమస్యలు లేకుండా చేస్తున్న ఖ్యాతి కేసీఆర్‌దే అన్నారు. రైతులకు భరోసాగా నిలిచేందుకు ఎకరాకు పెట్టుబడికి రూ.8 వేలు ఇస్తు 24 గంటలు ఉచిత కరెం టు ఇస్తున గొప్ప వ్యక్తి దేశంలో మరొకరు లేరన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలో వచ్చిన మూడున్నర ఏళ్లలో వితంతువుల, వృద్ధులకు రూ.200గా ఉన్న పింఛన్‌ను వేయిగా పెంచుట, వికలాంగులకు రూ.500 గా ఉన్న పింఛన్‌ను రూ.1500 లుగా పెంచారని, ఒంటరి మహిళలకు, గీతకార్మికులకు ఆసరాగా నిలిచి నెలకు 1000 రూపాయ లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తల్లిదండ్రులకు ఆడ పిల్లల పెళ్లిళ్లు భారంగా మారాయని గుర్తించిన ప్రభుత్వం కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ పధకాలను తీసుకోచ్చి రూ.50 వేల నుంచి రూ. 70వేలు చేశారని రానున్న కాలంలో లక్ష రూపాయల వరకు పెంచి ఆలోచనతో ఆడ పిల్ల ఉన్న ప్రతి ఇంటికి కేసీఆర్ పెద్ద దిక్కు అయ్యారన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలను బీటి రోడ్లు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, సాముల శివారెడ్డి, అల్లం ప్రభాకర్‌రెడ్డి,బడుగుల లింగయ్య యాదవ్, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, పాలేటి రామారావు, రేటోజు ఉమాకాంత్, కాసోజు వెంకటచారి, లకావత్ సైదులు, ఎంపిటీసి సుభద్ర, మండల ప్రధాన కార్యదర్శి గోవిందరెడ్డి, శాంతయ్య, యూత్ అధ్యక్షులు భుక్యా నగేష్, జిల్లా నాయకులు వెములూరి రంగాచారి, టిఆర్‌ఎస్ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, సినియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.