Home మెదక్ సొంతింటి కల నెరవేరేనా!

సొంతింటి కల నెరవేరేనా!

ldg

*నిర్మాణం చారెడు.. దరఖాస్తులు బారెడు..
*పేటలో కొనసాగుతున్న డబుల్ ఇండ్ల నిర్మాణం

మన తెలంగాణ/సదాశివపేట : సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట మండలంలోని గ్రామాలలో ఇండ్లు లేని నిరుపేదల చిరకాల స్వప్నం డబుల్ బెడ్‌రూమ్ నిర్మాణంతో సాకారం కానుంది. సంగారెడ్డి నియోజకవర్గంలోని 400 ఇండ్ల నిర్మాణానికి గతంలో టెండర్‌ను పిలవగా కాంట్రాక్టర్లు ముందుకు రాని కారణంగా జాప్యం జరిగింది. కాగా ప్రస్తు తం మండలంలోని సిద్దాపూర్ గ్రామ శివారులో తొలిదశలో వంద ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు హైదరాబాద్ కాంట్రాక్టర్ ముందుకొచ్చి పనులు ప్రారంభించడం జరిగింది. ఇందులో సగానికి పైగా పనులు పూర్తయ్యాయి. మరికొన్ని 6నెలల్లో చివరి దశకు చేరనున్నాయి. ఒక్కో భవనం మూడు అంతస్తులతో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రెండు పడకగదులతో పాటు స్నానపుగది, వంటగది, హాల్, త్రాగునీటి సరఫరా రోడ్డు సౌకర్యాలు కల్పిస్తున్నారు. చాలా ఏళ్లుగా అద్దె ఇండ్లలో, పూరిగుడిసెల్లో నివసిస్తున్న వేలాధిమందికి ఇంటిస్థలాలు దొరక్క, దొరికినా ఆకాశానంటే ధరలు ఉండటంతో పేద ప్రజలు సొంతింటికి నోచుకోలేకపోయారు. ఇం టి స్థలాల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. గత నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం నిరుపేదల ఇంటిస్థలాలకు దాదాపు 80 ఎకరా ల స్థలాన్ని రైతుల నుండి ఖరీదు చేసి పేదలకు పట్టాలను పంచిపెట్టింది. కానీ స్థలాల పోజుషన్ చూపించకపోవడంతో అవి నిరుపయోగంగా మా రాయి. దీంతో ప్రస్తుతం డబుల్‌బెడ్ రూమ్ అయినా దక్కుతుందన్నా ఆశ తో వేల సంఖ్యలో నిరుపేదలు దరఖాస్తులు చేసుకుంటున్నారు. హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉం డగా సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్, రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. పలువురు నిరక్షరాసులు గంపెడాశతో నాయకులు, అధికారులకు ప్రసన్నం చేసుకుంటున్నారు. వేలసంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఎంతమందికి లబ్దిచేకూరుతుందో వేచిచూడాల్సిందే.