Home తాజా వార్తలు దేశ రాజధానిలో వైద్యుడి దారుణ హత్య

దేశ రాజధానిలో వైద్యుడి దారుణ హత్య

Doctors-Strike-In-Mizoram

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. సెయింట్‌ స్టీఫెన్‌ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ఓ వైద్యుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం పాండే మృతదేహాన్ని ఆయన డ్యూటీ రూమ్‌లో కనుగొన్నారు. పాండే గొంతును సర్జికల్‌ బ్లేడ్‌తో కోసేశారు. మృతుడు అలహాబాద్‌కు చెందిన 26ఏళ్ల శశ్వత్‌ పాండేగా గుర్తించారు. పాండే స్నేహితుడే అతడిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంగా విచారణ చేపట్టారు.