Friday, April 19, 2024

అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడిని చితకబాదిన నర్సులు

- Advertisement -
- Advertisement -

 

Doctor harassment nurses at haryana
ఛండీగఢ్: ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో నర్సుగా పని చేస్తున్న ఆమెతో ఓ వైద్యుడు లైంగిక వేధింపులకు గురి చేసిన సంఘటన హర్యానాలోని పంచకుల సెక్టార్-6‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. డాక్టర్ మనోజ్ కుమార్ మానసిక వైద్యుడిగా పంచకుల ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. ఐసోలేషన్ వార్డుకు వచ్చిన వైద్యుడు నర్సును తన క్యాబిన్‌లోకి రమ్మని కబురు పంపాడు. క్యాబిన్‌లోకి వచ్చిన నర్సుతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే నర్సు తన పైఅధికారులకు ఫిర్యాదు చేసింది. సదరు వైద్యుడిపై చర్యలు తీసుకోకపోవడంతో స్థానిక నర్సులతో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సరం చేశారు. ఆగ్రహించిన నర్సులు అతడి క్యాబిన్‌కు వెళ్లి దాడి చేశారు. పోలీసులు రెండు ఘటనలపై కేసు నమోదు చేసి వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News