Home Default చెల్లితో చివరి కాల్

చెల్లితో చివరి కాల్

Priyanka Reddy Audio Call

 

దారుణ హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి చివరగా తన చెల్లి భవ్యకు ఫోన్ చేసింది. ఈక్రమంలో బుధవారం రాత్రి తన పరిస్థితిని గురించి అన్ని విషయాలను చెల్లికి విరించింది. వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వివరాలు…

ప్రియాంక: ఏమే.. నా బండి ఆగిపోయిందే.
భవ్య : సరే..
ప్రియాంక: కొంచెం సేపు మాట్లాడు.
భవ్య: ఎందుకు.. ఏమైంది.
ప్రియాంక: మాట్లాడవే.. తర్వాత చెబుతా.
భవ్య: అక్కడ యాక్సిడెంట్ అయ్యిందా?
ప్రియాంక: నాకు చాలా టెన్షన్‌గా ఉందే.
భవ్య ః గచ్చిబౌలిలో యాక్సిడెంట్ అయిందా?
ప్రియాంక: ఏంటీ… అర్థం కాలేదు.
భవ్య : యాక్సిడెంట్ అయిందా? అని అడిగా.
ప్రియాంక: లేదు.
భవ్య : మరీ..!
ప్రియాంక: అక్కడ బైక్ పెట్టిపోతా కదా?. అయితే బండి అక్కడ పెట్టి నిలబడ్డా, అయితే టోల్‌ఫ్లాజా సిబ్బంది వచ్చి.. మేడమ్ ఇక్కడ బండి పెట్టొద్దు.. ఇంతకుముందే పోలీసోళ్లు వచ్చి బండి పట్టికెళ్లి పోయారని చెప్పారు. అయితే తిరిగి ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఇంకో రోడ్డు ఉంటుంది కదా?. అక్కడ పెట్టి వెళ్లాను. తిరిగి ఇక్కడికి వచ్చేటప్పటికీ స్కూటీ టైర్ పంక్చరైంది.
భవ్య: అయితే బైక్ వదిలేసి వచ్చేయ్.
ప్రియాంక: వదిలేసి రావాలా?, వదిలేసి వస్తే.. పొద్దున ఎవరు తీసుకొస్తారే.
భవ్య: పొద్దున అంటే ఎవరినైనా తీసుకెళ్లి తెచ్చుకోవాలి.
ప్రియాంక: ఎవర్ని తీసుకెళ్లాలే.
భవ్య: మెకానిక్‌ను ?
ప్రియాంక: మెకానిక్ నా?
భవ్య: అవును మరీ?
ప్రియాంక: పంక్చర్ అయితే కొంచెం దూరం కూడా పోదా?
భవ్య: చూడాలే.. కొంచెం దూరం వస్తుందేమో?.. ఏ టైర్?
ప్రియాంక: వెనుకాల టైర్?
భవ్య: నాకు తెలియదు కదా? అక్కయా.
ప్రియాంక: ఆ..
భవ్య: నాకు తెలియదు కదా?
ప్రియాంక: అయితే చెబుతా విను.. ఇక్కడ ఒక లారీ ఉందే.. అందులో జనాలున్నారు. అందులో ఒకాయన నేను పంక్చర్ వేయిస్తానని తీసుకుపోయాడు.
భవ్య: మరి తీసుకురాలేదా?
ప్రియాంక: తీసుకొచ్చాడు. షాపు క్లోజ్ అయిందని తీసుకొచ్చాడు. ఇంకో షాపుకు తీసుకెళ్తానని పోయాడు.. నాకు భయమేస్తోందే.
భవ్య: మళ్లీ తీసుకు రాలేదా?
ప్రియాంక: పిల్లోడు పోయాడు.. భయమేస్తోందే?
భవ్య: అక్కడ.. ఎవరూ లేరా?
ప్రియాంక: వెహికిల్స్ ఉన్నాయి. టోల్‌ఉంటుంది కదా? ఆడా.. వాళ్లేమో.. నేను వెళ్తానంటే.. వద్దంటున్నారు. దెయ్యాల్లా వెంటపడ్డారు. మేడం వద్దు.. మధ్యలో ఆగిపోతుందన్నారు. భయమేస్తోందే పాప.
భవ్య: ఏమౌవుతుంది. అక్కడే అంటే టోల్ఫ్లాజా దగ్గరా?
ప్రియాంక: వాళ్లేమో బయటనే నిలబడ్డారు.
భవ్య: ఎవరు?
ప్రియాంక: లారీ వాళ్లు.
భవ్య: టోల్గేట్ ఉంటుంది కదా?. అక్కడకెళ్లి నిలబడు.
ప్రియాంక: అక్కడికా?.. పాప మాట్లాడవే.. నాకు భయమేస్తోంది.
భవ్య: ఏం ఫర్వాలేదు. టోల్ఫ్లాజా దగ్గరకు వెళ్లు.
ప్రియాంక: ఆ..
భవ్య: టోల్బూతుందా?, అక్కడికెళ్లు.
ప్రియాంక: వీళ్లేంటే.. సడన్గా ఎవరూ కనిపించట్లేదు. కనిపించాడే.. దెయ్యాల్లా ఈడే ఉన్నాడే. బండి స్టార్ చేశానే.. పోతుందే.. అప్పుడే కిందికొచ్చి.. మేడమ్. మేడమ్ టైర్ పంక్చర్ అయిందంటున్నాడే. బస్టాండ్ దగ్గర వరకూ వెళ్లదా?, బస్టాండ్ దగ్గర షాపు ఉంటుందే. కానీ వీళ్లేమో.. మేడమ్ మేము చేపించుకుని వస్తామంటున్నారే. ఓ పిల్లగాడ్ని పంపించాడే. ఆ పిల్లగాడు పోయాడు.. వట్టిగానే వచ్చిండు. మళ్లీ ఇంకో షాపు ఉందని చెబుతున్నాడు. లేటవుతుంది.. నేను వెళ్తానంటే.. లేదు మేడమ్.. మధ్యలో ఆగిపోతే ఇబ్బంది పడతారంటున్నాడే. దెయ్యాల్లో నా వెంట పడ్డారే.
భవ్య: మరి మధ్యలో ఆగిపోతే ఇబ్బందే కదా?
ప్రియాంక: ఏమోనే నాకు చాలా భయమేస్తోందే.
భవ్య: టోల్ బూత్ దగ్గరకు వెళ్లి నిలబడవే.
ప్రియాంక: టోల్ బూత్ దగ్గరకు వెళ్లి ఏం నిలబడలే.. అందరి ముందు.. అక్కడ నిలబడితే అందరూ నన్నే చూస్తారే.
భవ్య: చూస్తూనే ఉండని.. జనాలు ఉంటారు కదా?.
ప్రియాంక: చాలా భయమేస్తోందే. వాళ్లను చూస్తుంటే భయమేస్తోంది.
భవ్య: టోల్‌బూత్ దగ్గరకు వెళ్లి.. అక్కడ నిలబడమన్నాను కదా?
ప్రియాంక: ఏడుపొస్తోంది.
భవ్య: అంత లేటుగా వెళ్లడం అవసరమా?
ప్రియాంక: లేదుగా.. అది కాదు తల్లీ… భయమేస్తోందే పాప. దెయ్యంలా ఉన్నాడే. ఇక్కడ నిలబడాలనే లేదు.
భవ్య: వెళ్లూ.. టోల్బూత్ దగ్గరకు…
ప్రియాంక: ఆ..
భవ్య: టోల్బూత్ దగ్గరకు వెళ్లి నిలబడు.
ప్రియాంక: అక్కడికి పోతే.. వచ్చే పోయే వారంతా నన్నే చూస్తారే. కొంచెం సేపు మాట్లాడవే పాప. బైకొచ్చేదాకా టెన్షన్ అవుతుందే.
భవ్య: బైకొచ్చేదాకా మాట్లాడుతూ కూర్చోవాలా?
ప్రియాంక: 5 నిమిషాలకే ఇలా చేస్తావేంటే.. దెయ్యం పిల్ల నీవు. రోడ్డు మీద ఒక్కదానినుంటే…
భవ్య: ఎగబడి.. ఇంత అర్ధరాత్రి పోవడం అవసరమా? మరీ.
ప్రియాంక: ఒక పనైపోతుంది కదా?.. పాప.
భవ్య: ఇంత రాత్రి వెళ్లడం అవసరమా?, రేపు పోకూడదా?
ప్రియాంక: రేపు ఆఫీస్లో మీటింగ్ ఉందని చెప్పారు మాకూ.
భవ్య: కొంచెం సేపైనా తర్వాత మళ్లీ చేస్తాను లే.
ప్రియాంక: సండే… మండే టెంపుల్కి తీసుకుపోతున్నారు. అసలు కుదరడమే లేదు. వాళ్లను చూస్తుంటే చాలా భయమేస్తోందే. భయంగా ఉందే. ఏం పిల్లగాడో ఇంకా రాలేదు.
భవ్య: సరిలే మరి.. కొంచెం సేపైనా తర్వాత ఫోన్ చేస్తాను లే.
ప్రియాంక: ఫోన్లో ప్రియాంక ఏడుస్తూనే ఉంది. లేదు పాప.
భవ్య: సరిలే.. కొంచెం సేపైనా తర్వాత చేస్తాలే. ఒక 5 నిమిషాలు అయ్యాక మళ్లీ చేస్తాను లే.
ప్రియాంక: ఊ…. ఫోన్ కట్ అయింది.
ఇదిలావుండగా ప్రియాంక రెడ్డి హత్యకు ముందు.. తన సోదరి భవ్యతో ఫోన్లో మాట్లాడుతూ పదే పదే భయమేస్తోందే.. భయమేస్తోందే.. అంటూ కంటతడి పెట్టింది.

Doctor Priyanka Reddy Last Audio Call With Her Sister