Saturday, April 20, 2024

హిమాయత్ సాగర్ వద్ద పల్టీలు కొట్టిన కారు…

- Advertisement -
- Advertisement -

Doctor Seriously Injured in Road Accident At Himayat sagar

రంగారెడ్డి: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయిన ఓ కారు బోల్తాపడి చెట్ల పొదల్లోకి ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో కారు లో ప్రయాణిస్తున్న ఓ వైద్యురాలికి తీవ్ర గాయాలయ్యాయి. కుక్కను తప్పించేందుకు ఆమె స్టీరింగ్ ను పక్కకు తిప్పినట్టు సమాచారం. దీంతో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. గురువారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కారు పక్కనే ఉన్న గుట్టలోకి దూసుకెళ్లడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు తీవ్రగాయాలతో కారులో ఇరుకున్న వైద్యురాలిని బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Doctor Seriously Injured in Road Accident At Himayat sagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News