Friday, April 19, 2024

కనబడని శత్రువుతో వైద్యుల పోరాటం: రాజేందర్

- Advertisement -
- Advertisement -

Doctors fight against corona virus

కామారెడ్డి: వైద్యులు కనబడని శత్రువుతో పోరాటం చేస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో కరోనా, సీజనల్ వ్యాధులపై మంత్రులు ఈటెల రాజేందర్, వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడారు. చరిత్రలో వైద్యుల సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని, భగవంతుని తరువాత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న వైద్యుల మాత్రమేనని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో కరోనా కట్టడికి వైద్యులు అందిస్తున్న సేవలు చిరస్మరణీయమన్నారు. 81 శాతం మందికి ఎలాంటి కరోనా లక్షణాలు కనబడవని, 19 శాతం మందికి మాత్రమే వైద్యుల సేవలు అవసరం ఉంటాయని ఈటెల తెలియజేశారు. కరోనా బారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడడానికి సిఎం కెసిఆర్ ఎంత ఖర్చయినా పర్వాలేదన్నారని చెప్పారన్నారు.. ఈ కార్యక్రమంలో ఎంపి బిబి పాటిల్, విప్ గంప గోవర్థన్, ఎంఎల్‌ఎ జాజాల సురేందర్, జిల్లా పరిషత్ చైరపర్సన్ శోభ, మున్సిపల్ చైర్‌పర్సన్ జాహ్నవి, కలెక్టర్ శరత్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News