Wednesday, April 24, 2024

కాన్పు కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్తే..కడుపులో..

- Advertisement -
- Advertisement -

జగిత్యాల : కాన్పు కోసం జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి వచ్చిన నవ్యశ్రీ అనే మహిళ కడుపులో క్లాత్ మరిచిపోయి వైద్యులు కుట్లువేసిన సంఘటనపై బుధవారం త్రిమెన్ కమిటీ విచారణ చేపట్టింది. కడుపులో క్లాత్ మరిచిపోయి న సంఘటన పట్ల సీరియన్ అయిన జిల్లా కలెక్టర్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేసి నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ త్రిమెన్ కమిటీని నియమించారు. ఈ మేర కు త్రిమెన్ కమిటీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా విచారణ కమిటీలో సభ్యుడిగా ఉన్న జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు మాట్లాడుతూ, నవ్యశ్రీకి మొత్తం మూడు సిజేరియన్ ఆపరేషన్లు జరిగాయని, గతంలో చేసిన రెండు ఆపరేషన్లు ఎక్కడ జరిగాయో ఆమె చెప్పలేదన్నారు.

మూడవ సిజేరియన్ జగిత్యా ల ఆస్పత్రిలో జరిగిందని, అప్పుడు ఆపరేషన్ చేసిన డాక్టర్ మీనా, హెల్త్ సూపర్‌వైజర్ శిరీష, స్టాఫ్ నర్స్‌లను విచారించామని, ఆపరేషన్ సమయంలో నవ్యశ్రీ పొట్ట లో తాము ఏమి మరిచిపోలేదని వివరించినట్లు తెలిపారు. ఆపరేషన్ చేసే సమయంలో స్టాఫ్ నర్సులు మోప్‌లు సక్రమంగా ఇచ్చారా లేదా అనే విషయంలో కూ డా విచారణ చేశామన్నారు. ఆపరేషన్ జరిగిన సంవత్సరం తర్వాత నవ్యశ్రీ కడుపులో నొప్పి ఉందంటూ వివిధ ఆస్పత్రులు తిరిగిందని, చివరికి నిజామాబాద్‌లో సిటీ స్కానింగ్ చేసి కడుపులో క్లాత్ ఉన్నట్లు గుర్తించడంతో వేములవాడలో తెలిసిన డాక్టర్ వద్దకు వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నట్లు నవ్యశ్రీ తెలిపిందని వివరించారు.

అయితే గతంలో అపరేషన్ చేసిన సందర్భంలో కడుపులో గుడ్డ మరిచిపోయే అవకాశం ఉందని, జగిత్యాలలో ఆపరేషన్ చేసే సమయంలో సిబ్బందికి క్లాత్ కనిపించలేదని, కడుపులో ఉన్నా ఒక్కోసారి కనిపించకపోవచ్చని డాక్టర్ రాములు తెలిపా రు. ఆపరేషన్ చేసే సమయంలో సిస్టర్లకు ఎన్ని మాప్‌లు ఇచ్చారో ఆపరేషన్ అనంతరం సిస్టర్లు మాప్‌ల లెక్క చూపించాల్సి ఉంటుందన్నారు. నవ్యశ్రీ పొట్టలో 10/ 10 సైజు మాప్ బయటపడిందని, జగిత్యాల ఆస్పత్రిలో వాడే మాప్‌లు 6/6 సైజు మాత్రమే వాడుతామని ఆయన వివరించారు. మహిళలకు కాన్పులు చేసిన వైద్యులది నిర్లక్షమని తేలితే కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి నివేదిస్తామని సూ పరింటెండెంట్ డాక్టర్ రాములు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News