Home అంతర్జాతీయ వార్తలు చైనా పెద్దమనిషి గొంతులో జలగలు

చైనా పెద్దమనిషి గొంతులో జలగలు

Leeches
రెండు నెలలు వీడని దగ్గుతో వెలుగులోకి

బీజింగ్ : పట్టుమని పది నిమిషాలు కంగుకంగు మని దగ్గుతూ ఉంటేనే తట్టుకోలేం. అలాంటిది చైనాలో ఓ వ్యక్తికి రెండు నెలల పాటు విరామం లేని దగ్గు వచ్చింది. దీనితో అసలు తనకేం అవుతున్నదో తెలియని స్థితికి వచ్చాడు. వెంటనే ఆసుపత్రికి వెళ్లిన ఈ 60 ఏండ్ల వ్యక్తిని రోగిగా చేర్చుకుని అన్ని పరీక్షలు చేశారు. చివరికి దీనిలో తేలిందేమిటంటే ఆయన గొంతు, ముక్కుకవాటాలలో రెండు బతికున్న జలగలు ఉన్నాయి. ఈ జీవులు ఈ జీవిని అదే పనిగా కుడుతూ ఉండటంతో ఈ వ్యక్తికి విరామం లేని దగ్గు జబ్బు వచ్చి పడిందని నిర్థారించారు. అయితే పట్టువదలని లక్షణంతో ఉండే ఈ పరాన్నజీవులు ఈ మనిషి శరీరంలోకి ఏ విధంగా చేరుకున్నాయనేది తేటతెల్లం కాలేదు. క్సింగ్‌వెన్ కౌంటీకి చెందిన ఈ వ్యక్తి పేరును అధికారులు వెల్లడించలేదు. తను వీడని దగ్గు, మధ్యమధ్యలో రక్తంతో కూడిన కఫం వస్తోందని ఈ వ్యక్తి తెలియచేసుకున్నారు.

తొలుత జరిపిన సిటి స్కాన్‌లో ఎటువంటి శారీరక అవలక్షణాలు లేవు. తరువాత కీలకమైన బ్రాన్కోస్కోపీ చేశారు. దీనితో ఈ జలగల కదలికలను గుర్తించారు. కుడి ముక్కు కవాటంలో ఒకటి ఉండగా మరోటి స్వరపేటిక వద్ద కొట్టుమిట్టాడుతూ ఉంది. డాక్టర్ రావు గుయాంగ్ ఈ వ్యక్తి నుంచి ఈ జలగలను అత్యంత చాకచక్యంగా ఆపరేషన్ లేకుండా వేరు చేశాడు. ఈ జలగలు ఒక్కోక్కటి ఆరు అంగుళాలు పైగా ఉన్నాయి. ఈ వ్యక్తి ఎప్పుడూ దట్టమైన అడవుల్లో కాయకష్టం చేస్తుంటాడు. ఈ క్రమంలో జలపాతాలు, వాగులలోని నీటిని చూసుకోకుండా తాగడంతో వాటిలోని జలగలు శరీరంలోకి చేరాయి. ఈ మనిషిని పీలుస్తూ వచ్చాయి. జలగపట్టు వీడిన ఈ వ్యక్తి ఇప్పుడు స్వేచ్ఛ పొందిన వ్యక్తిలాగా తిరుగుతున్నాడు.

Doctors removed two live leeches from man nose