Tuesday, April 23, 2024

బస్తీ దవాఖానల్లో వైద్యుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తాం

- Advertisement -
- Advertisement -

Basti Dawakhana

 

హైదరాబాద్ : బస్తీ దవాఖానలో భర్తీ చేసే వైద్యులు, నర్సుపోస్టుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, దళారుల మాటలకు అభ్యర్దులు మోసపోవద్దని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాదికారి డా. జె. వెంకటి పేర్కొన్నారు. జిల్లా పరిధిలో 94 డాక్టర్లు, 58 స్టాప్ నర్సులకు నోటిఫికేసన్ జారీ చేసి ఫిబ్రవరి 24వరకు దరఖాస్తులు తీసుకున్నట్లు, అందజేసిన దరఖాస్తులను స్క్రూటినీ చేస్తున్నామని వెల్లడించారు. వైద్యుల పోస్టులకు 492, స్టాప్ నర్సులకు 3478 దరఖాస్తులు వచ్చినట్లు, ఎంపిక విధానంలో అక్రమాలకు తావులేకుండా మెరిట్ పద్దతిలో ఎంపిక చేస్తామని, స్దానికులకు 90శాతం, స్దానికేతరులకు 05శాతం చొప్పున భర్తీ చేస్తామని వివరించారు.

వైద్య అభ్యర్దుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టును మార్చి 2న సాయంత్రంవరకు ఆన్‌లైన్‌లో పెడుతామని, ఏమైనా అభ్యంతరాలుంటే మార్చి 3,4 తేదీల్లో తెలియజేయాలన్నారు. 5,6 తేదీల్లో అభ్యంతరాలు పరిశీలించి 7వతేదీన సాయంత్రం తుదిజాబితా వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు. స్టాప్‌నర్సు పోస్టులకు మార్చి 6న ప్రొవిజినల్ మెరిట్ లిస్టు ఆన్‌లైన్ ఉంచుతామని, అభ్యంతరాల కొరకు 4 రోజుల సమయమిచ్చి తుదిజాబితా మార్చి 18న వెబ్‌సైట్‌లో ఉంచుతామని తెలిపారు.

జిహెచ్‌ఎంసి, ఆరోగ్య సమన్వయంతో కొత్త బస్తీదవాఖానల ఏర్పాటు ః జిల్లాలో ఇప్పటికే 74 బస్తీ దవాఖానల్లో రోగులకు నాణ్యమైన సేవలందిస్తున్నామని, వాటిని 160వరకు పెంచేందుకు జిహెచ్‌ఎంసి, ఆరోగ్యశాఖ సమన్వయంగా పనిచేస్తుందన్నారు. 10వేల మంది జనాభాకు ఒకటి చొప్పున పేదలకు దవాఖానలు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.

132 రకాల మందులు, 55రకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు, 18 ఈవినింగ్ క్లీనిక్ నిర్వహిస్తున్నామని, బస్తీదవాఖానలకు రోజుకు 80మంది నుంచి 240మందికి సేవల కోసం వస్తున్నట్లు వెల్లడించారు. సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారుల పర్యవేక్షణలో ఆసుపత్రుల నిర్వహణ ఉన్నట్లు చెప్పారు. వారం రోజులు 21 బస్తీ దవాఖానలు ప్రారంభించేందుకు సిద్దం చేసినట్లు తెలిపారు. షుగర్, బిపి, థైరాయిడ్ వంటి రోగలకు కూడా చికిత్సలు అందిస్తున్నట్లు వివరించారు.

Doctors Replacement in Basti Dawakhana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News