Home తాజా వార్తలు రుద్రమాదేవి అకాడమీకి హైరెంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్

రుద్రమాదేవి అకాడమీకి హైరెంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్

High Range Book of World Record

 

మన తెలంగాణ/ఇల్లందు టౌన్‌: సింగరేణి ఆధ్వర్యంలో రుద్రమాదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ సహాయంతో గతనెల 23వ తేదీన నిర్వహించిన ఆత్మరక్షణ అవగాహణా, అభ్యసన కార్యాక్రమానికి హైరెంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ద్రువీకరణ పత్రం దక్కింది. ఈ సందర్భంగా గురువారం స్థానిక సింగరేణి వైసిఒఎ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో రికార్డు ద్రువీకరణ పత్రాన్ని సింగరేణి సంస్థ తరుపున స్థానిక జిఎమ్ కందుకూరి లక్ష్మినారాయణ హైదరాబాద్ ప్రతినిధుల చేతుల మీదుగా అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆత్మరక్షణ అవగాహణ, అభ్యసన కార్యక్రమంలో పాల్గొన్న అన్ని పాఠశాలల విద్యార్థులు, యువతులు నేర్చుకున్న మెలుకువలతో స్వయంగా ప్రత్యర్థులను ఎదుర్కొనే సామర్థ్యం కల్గి వుండాలని అన్నారు. హైరెంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ ఇప్పటికి వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన 2000 మంది ప్రముఖులకు రికార్డ్ ద్రువీకరణ పత్రం అందించిందని దానిని సింగరేణిలో మన ప్రాంతానికి రావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ లక్ష్మినారాయణ, అకాడమీ శిక్షకులు ఎన్ లక్ష్మి, జాతీయ శిక్షకులు రవి, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

 

Document Receive from High Range Book of World Record