Wednesday, April 24, 2024

30 సెకండ్లలో హంతకుడిని పట్టేసిన జాగిలం!(వీడియో)

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ఉద్ధమ్ సింగ్ నగర్ జిల్లాలో పోలీసు శాఖకు చెందిన ఓ జాగిలం కేవలం 30 సెకండ్లలో హంతకుడిని పట్టేసింది. ఆ జాగిలం అక్కడి పోలీస్ శాఖలోని ‘కెనైన్ స్కాడ్’కు చెందింది. అదో జర్మన్ షెఫర్డ్ జాగిలం. దాని పేరు ‘కట్టీ’.
2023 మార్చి 6న అక్కడ ఓ హత్య జరిగింది. షకీబ్ అహ్మద్ అనే 21 ఏళ్ల వ్యక్తి హత్యకు గురయ్యాడు. గాయాల మచ్చలతో అతడి శవం జస్పూర్ పోలీస్ పరిధిలోని పొలాల్లో పడి ఉండడాన్ని పోలీసులు కనుగొన్నారు. తర్వాత జాగిలం ‘కట్టీ’తో షకీబ్ రక్తపు మరకలు ఉన్న దుస్తులను వాసన పట్టించారు.

వాసన పట్టిన ఆ జాగిలం కేవలం 30 సెకండ్లలోనే అనుమానితులను నిలిపిన వరుసలో నిలబడిన హతుడి బంధువుని చూసి అరవడం మొదలెట్టింది. దాంతో ఎస్‌ఎస్‌పి టిసి. మంజునాథ్ వివరాలను వెల్లడించారు. హంతకుడు ఖాసీమ్‌ను పోలీసులు విచారణ చేయగా తప్పు ఒప్పుకున్నాడు. అతడిని చివరికి అరెస్టు చేశారు.

ఇదిలావుండగా జాగిలంకు మార్చి 7న రూ. 2500 క్యాష్ రివార్డు, ‘బెస్ట్ పర్సనల్ ఆఫ్ ద మంత్’ అన్న అవార్డును ప్రదానం చేశారు. కట్టీకి ఓ జ్ఞాపిక, పురస్కారం ఇచ్చారు. అంతేకాక దానికి శిక్షణ ఇచ్చే యోగేంద్ర రాఘవ్ వద్దనే దానిని ఉంచారు. ‘జాగిలం సాయం లేకుండా కేసును ఛేదించడం పోలీసులకు చాలా సమయం పట్టి ఉండేది’ అని జస్పూర్ స్టేషన్ హెడ్ ఆఫీసర్ పిఎస్. దను తెలిపారు. ‘కట్టీ’ 2016 నుంచి పోలీసులకు సేవలందిస్తోంది. ఇప్పటి వరకు ఏడు కేసులను అది ఛేదించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News