Home వరంగల్ నీడలోనూ రక్షణే …

నీడలోనూ రక్షణే …

Dog Under The police patrolling vehicle
కమలాపూర్ : గ్రామాల్లో తిరుగుతూ రాత్రింబవళ్ళు రక్షణ భాధ్యతలు చేపడుతున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనం చివరకు నీడలోనూ జంతువులకు రక్షణ కల్పిస్తోంది. ఇదేంటి నీడలోనూ రక్షణ ఎలా అని అనిపించినా.. ఈ చిత్రం కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం చోటు చేసుకోగా మన తెలంగాణ కెమెరా క్లిక్ మనిపించింది. స్ధానిక పోలీస్ స్టేషన్ ఎదుట పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్నీ పోలీస్‌లు నిలిపివేయగా మధ్యాహన్న సమయంలో ఎండకు ఓ శునకం తన కుక్క పిల్లలతో వాహనం క్రింద సేదతీరుతూ పిల్లలకు పాలిచ్చి ఆలన పాలన చూడటంతో పాటు ఆటల్లో మునిగిపోయింది. పెట్రోలింగ్ వాహనం క్రింద నీడకు కుక్క పిల్ల శునకాలతో గంటల కొద్ది సేదతీరగా స్టేషన్‌కు వచ్చే వారు మాత్రం వాహనం ప్రజలకు రక్షణ ఇస్తూనే జంతువులకు నీడలోనూ రక్షణ కలిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం చేసారు.

Dog Under The police patrolling vehicle