Saturday, April 20, 2024

హెల్మెట్ పెట్టుకున్న పెంపుడు శునకం(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

చెన్నై: పెంపుడు జంతువులు తమ యజమానితోపాటు బైక్‌లో ప్రయాణించడం సర్వసాధారణమే. అయితే.. తన యజమానితో పాటు తాను కూడా హెల్మెట్ ధరించి ఒక శునకం బైక్‌లో ప్రయాణించడం మాత్రం అసాధారణం. ఈ అరుదైన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. చెన్నైలోని విరుగంబాకంలో తీసిన ఈ వీడియోలో ఒక పెంపుడు శునకం హెల్మెట్ పెట్టుకుని తన యజమాని వెనుక కూర్చుని టీవీలర్‌లో ప్రయాణించిన వీడియో వైరల్ అవుతోంది. బైక్ వెనుక కదలకుండా కూర్చున్న ఆ శునకం తన ముందు కాళ్లను యజమాని భుజంపైన వేసి దర్జాగా వెళుతుండడాన్ని చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. వాహన చోదకుడే కాదు వెనుక కూరున్న వారు కూడా తమ భద్రత కోసం హెల్మెట్ ధరించాలన్న నిబంధన చెన్నైతోపాటు మరి కొన్ని నగరాలలో ఇప్పటికే అమలులో ఉంది. ఆ నిబంధనను కచ్ఛితంగా పాటిస్తున్న ఆ శునకానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.

https://twitter.com/madhavpramod1/status/1214415853065666560

Dog wearing helmet wins hearts goes video viral

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News