Home జాతీయ వార్తలు ఎనిమిదేళ్ల బాలుడిని పీక్కతిన్న కుక్కలు… బాలుడు మృతి

ఎనిమిదేళ్ల బాలుడిని పీక్కతిన్న కుక్కలు… బాలుడు మృతి

 

చెన్నై: తమిళనాడులోని తిరునళ్‌వెలి జిల్లా సంకరణ్‌కోయిల్ ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలుడిని కుక్కలు కరిచి చంపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రెంగాసముతిరమ్ గ్రామంలో సెతూపతికి సంతోష్ ఎనిమిదేళ్ల బాలుడు ఉన్నాడు. సంతోస్ స్కూల్ నుంచి వచ్చిన తరువాత ఇంటి దగ్గర పుస్తకాల బ్యాగ్ పెట్టిన అనంతరం టీ తాగి గ్రౌండ్‌లోకి వెళ్లాడు. గ్రౌండ్‌కు పోయిన సంతోష్ రాకపోవడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు వెతకడం ప్రారంభించారు. గ్రౌండ్ మధ్యలో కుక్కల అరుపులు వినిపించడంతో ఓ వ్యక్తి అక్కడికి వెళ్లి చూడగా బాలుడిని కుక్కలు పీక్కతింటున్నాయి. కుక్కలను దూరంగా తరిమికొట్టి గ్రామంలో ఉన్న వైద్యుడికి ఆ వ్యక్తి సమాచారం ఇచ్చాడు.  పరీక్షించిన వైద్యులు బాలుడు చనిపోయాడని తెలిపాడు. మెడ భాగంలో కుక్కలు కరవడంతో బాలుడు చనిపోయాడని వైద్యుడు పేర్కొన్నాడు. బాలుడిది అసహజ మరణం కింద  పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

 

Dogs Bite Eight Years Old Boy to Dead in Tamilnadu