- Advertisement -
హైదరాబాద్ : ఇంటర్ కళాశాలల జూనియర్ ఒప్పంద అధ్యాపకుల సమ్మె చేయడం మంచి పద్ధతి కాదని.. వెంటనే విరమించి విధుల్లో చేరాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. వెంటనే సమ్మె విరమించకుంటే ప్రభుత్వ చర్యలుకు సిద్ధపడాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ ప్రోద్భలంతో కొందరు జూనియర్ అధ్యాపకులు సమ్మెకు దిగడం అన్యాయమని పేర్కొన్నారు. అడగకముందే ప్రభుత్వం వేతనాలు పెంచిందని, క్రమబద్దీకరణ కోసం మంత్రిమండలి తీర్మానం చేసి జీవో జారీ చేసిందని వివరించారు.
- Advertisement -