Home తాజా వార్తలు డాలర్ @73.42

డాలర్ @73.42

daller

న్యూఢిల్లీ: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్టానికి పతనమైంది. బుధవారం రూపాయి విలువ తొలిసారిగా 73ను దాటింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 43 పైసలు క్షీణించి 73.34 కు చేరింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే దేశీ కరెన్సీ భారీగా పతనమై 73.42ను తాకింది. ఇది చరిత్రాత్మక కనిష్టం, అయితే ఆ తర్వాత కాస్త కోలుకుంది. వచ్చే నెల నుంచి ఇరాన్ పెట్రోలియం పరిశ్రమపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు మండుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ కరెన్సీపై ఎక్కువగా కనిపించింది. మరోవైపు డాలరు రోజు రోజుకీ మరింతగా బలపడుతోంది. ఒక దశలో రూపాయి 72.96 వరకూ బలపడినప్పటికీ మిడ్ సెషన్ నుంచి తిరిగి స్టాక్‌మార్కెట్లో అమ్మకాలు ఊపందుకోవడంతో రూపాయి బలహీనపడుతూ వచ్చింది. రూపాయి సాంకేతికంగా కీలకమైన 72.95 -73 స్థాయిని కోల్పోయిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. సోమవారం రూపాయి విలువ ముగింపు 72.91, అంటే 40 పైసలు వరకు నష్టపోయింది.
uబుధవారం ఉదయం డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.26 వద్ద ప్రారంభమైంది. మంగళవారం గాంధీ జ యంతి సందర్భంగా ట్రేడింగ్ లేదు. సోమవారం రూపాయి 72.91 వద్ద ముగిసింది. ఓ దశలో రూపాయి విలువ 73.42కు పతనమైంది. క్రూడ్ ఆయిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నందు వల్ల డాలర్‌పై రూపాయి మరింత ఒత్తిడిని ఎదుర్కోనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
uక్రూడాయిల్ ధరల ప్రభావం దేశీయ బాండ్లు, రూ పాయిపై కొనసాగుతోందని ఫారెక్స్ అడ్వైజరీ సంస్థ ఐఎఫ్‌ఎ గ్లోబల్ నోట్‌లో పేర్కొంది. క్రూడాయిల్ ధరలు పెరగనుండడంతో ఆర్‌బిఐ ద్రవ్యలభ్యత చర్యలు చేపట్టింది.
uవచ్చే నెలలో ఇరాన్ చమురు దిగుమతులపై ఆంక్షలు అంతర్జాతీయంగా చమురు రేట్ల పెరుగుదలకు కారణమవుతున్నాయి. మరోవైపు డాలర్ మరింత బలపడుతోంది. బుధవారం అంతర్జాతీయం మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 85 డాలర్లు పలికింది. 2014లో 85.45 డాలర్ల స్థాయికి ప్రస్తుతం క్రూడాయిల్ ధర చేరింది. ఏప్రి ల్ నుంచి చమురు ధర దాదాపు 20 శాతం పెరిగింది.
uరూపాయిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్య లు తీసుకుంటున్నప్పటికీ మార్కెట్లు సానుకూలంగా స్పం దించలేదు. ప్రస్తుతం తాత్కాలిక అంశాలు మార్కెట్లపై ప్ర తికూల ప్రభావం చూపాయి. క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా మార్కెట్లు కదలాడాయి. బ్యారెల్ క్రూడాయిల్ 75 వద్ద ఉంది. ఇది 8890 పడిపోనుందనే ఆందోళనలు మార్కెట్లను బెంభేలెత్తించాయని ఎడిల్వీస్ సె క్యూరిటీస్ ఫారెక్స్ అండ్ రేట్స్ హెడ్ సజల్ గుప్తా అన్నారు.

rupai-coin

చమురు ప్రభావం
రూపాయి పతనానికి ప్రధాన కారణం ముడి చమురు ధరలే.. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ బ్యారల్ 75 డాలర్లను అధిగమించింది. దీని వల్ల అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే భారత్‌కు మరింత భారం పడనుంది. దీంతో దేశీ కరెన్సీకి వణుకు పుడుతున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. తాజాగా లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ ఏకంగా 85 డాలర్లకు చేరింది. ఇది నాలుగేళ్ల గరిష్ట స్థాయి.. న్యూయార్క్ మార్కెట్లోనూ నైమెక్స్ చమురు బ్యారల్ 75 డాలర్లను అధిగమించిం ది. ఇప్పటికే అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి చమురు దిగుమతులకు బ్రేక్ పడనుండడంతో దిగుమతుల బిల్లు భారం కానుంది. దీంతో వాణిజ్య లోటు పెరగనుంది. మరోవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు స్టాక్స్‌లో అమ్మకాలు చేపట్టడం ద్వారా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం కూడా ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు తెలియజేశారు.