Home తాజా వార్తలు 66% తగ్గిన విమాన ప్రయాణికులు : డిజిసిఎ వెల్లడి

66% తగ్గిన విమాన ప్రయాణికులు : డిజిసిఎ వెల్లడి

Domestic Air Passenger Traffic Down 66% In Sept

 

న్యూఢిల్లీ : దేశీయంగా విమాన ప్రయాణికుల రద్దీ సెప్టెంబర్ నెలలో 66 శాతం క్షీణించింది. సెప్టెంబర్‌లో 39.43 లక్షల దేశీయ విమాన ప్రయాణికులు నమోదైనారు. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 66 శాతం తక్కువగా ఉందని డిజిసిఎ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) వెల్లడించింది. ఈ ఏడాది జూలైలో 21.07 లక్షల మంది, ఆగస్టులో 28.32 లక్షల మంది ప్రయాణించారని డిజిసిఎ తెలిపింది. సెప్టెంబర్‌లో ఇండిగో నుండి 22.66 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించగా, దేశీయ విమానయాన మార్కెట్లో ఈ సంస్థ వాటా 57.5 శాతం ఉంది. అదే సమయంలో స్పైస్ జెట్ నుండి ప్రయాణికుల సంఖ్య 5.3 లక్షలు ఉండగా, ఈ కంపెనీ మార్కెట్ వాటా 13.4 శాతంగా ఉంది. డిజిసిఎ డేటా ప్రకారం, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా ఇండియా, విస్టార్, గోఎయిర్ నుండి వరుసగా 3.72 లక్షలు, 2.35 లక్షలు, 2.58 లక్షలు, 2.64 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు.

Domestic Air Passenger Traffic Down 66% In September