Home అంతర్జాతీయ వార్తలు శ్రీలంకలో దేశీయ విమానయాన సేవలు నిలిపివేత

శ్రీలంకలో దేశీయ విమానయాన సేవలు నిలిపివేత

Domestic Aviation Servicesకొలంబో: శ్రీలంకలో ఆదివారం  బాంబు పేలుళ్ల జరిగాయి. ఈ పేలుళ్లలో 185 మంది చనిపోయారు. ఈ ఘటనతో ప్రపంచ దేశాలు ఉలిక్కి పడ్డాయి.  బాంబు పేలుళ్ల కారణంగా  జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని  శ్రీలంక  విమానయానశాఖ ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దేశీయ విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేసినట్లు వారు తెలిపారు. బండారునాయకే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో  అదనపు భద్రతను కల్పించారు. సాధారణ సమయానికంటే నాలుగు గంటలు ముందుగానే ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈస్టర్ సండే వేడుకలను పురస్కరించుకుని మూడు చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్న వారిపై, మూడు హోట్లతో పాటు మరో రెండు చోట్ల సూసైడ్ బాంబర్లు దాడి చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 185 మంది చనిపోయారు. 400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో వంద మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇస్లామిక్ ఉగ్రవాదులే ఈ పేలుళ్లకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. దీంతో శ్రీలంకలో హైఅలర్ట్ ప్రకటించారు. పలు చోట్ల కర్ఫ్యూ విధించారు.

Domestic Aviation Services Stop in Sri Lanka