Friday, March 29, 2024

గ్యాస్ సిలిండర్ పై రూ.25 పెంపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల ధరలను పెట్రోలియం కంపెనీలు మరోసారి పెంచాయి. సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ ధరను రూ.25 పెరిగింది. దీంతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.859.5కు చేరుకుంది. ఇంతకు ముందు ఇది రూ.834.50గా ఉంది. గతంలో జూలై 1న కూడా ఆయిల్ కంపెనీలు ఎల్‌పిజి సిలిండర్ రేట్లను రూ.25.50 పెంచాయి. ఇక తాజా ఎల్‌పిజి రేట్లు వివిధ నగరాల్లో చూస్తే, ముంబైలో గ్యాస్ సిలిండర్ రేటు రూ.834.50 నుంచి రూ.859.5 పెరిగింది. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.861 నుంచి రూ.886కు చేరింది. చెన్నైలో రూ.850.50 నుంచి రూ.875.50కు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో సబ్సిడీ లేని ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.887లు ఉండగా, ఇప్పుడు రూ.25 పెంపుతో రూ.912కి చేరింది. ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ప్రతి 15 రోజులకోసారి గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు చేస్తాయి.

Domestic LPG Gas price hiked by Rs 25

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News