Home అంతర్జాతీయ వార్తలు కరోనాతో దావూద్ మృతి…?

కరోనాతో దావూద్ మృతి…?

Don Dawood Ibrahim Died With Corona

ఇస్లామాబాద్ : పాక్‌లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరోనాతో మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. 1994 నుంచి పాక్‌లో తల దాచుకుంటున్న దావూద్‌తో పాటు అతని భార్య మెహజబీన్ కరోనాతో బాధపడుతూ కరాచీ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు రెండు మూడు రోజులుగా వార్తలు వచ్చాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతు దావూద్ మృతి చెందాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దావూద్ మృతి చెందినట్టు పాక్‌కు చెందిన న్యూస్ ఎక్స్ మీడియా శనివారం ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయితే దావూద్ చనిపోయినట్టు వస్తున్న వార్తలను పాక్ మాత్రం ధ్రువీకరించలేదు. 1993 నాటి ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్ సూత్రధారిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో వందలాది మంది చనిపోయారు. 25 ఏళ్ల నుంచి దావూద్ పాక్‌లోని రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే దావూద్‌ను పాక్ నుంచి భారత్ రప్పించేందుకు భారత అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో దావూద్ కరోనాతో మృతి చెందినట్టు వస్తున్న వార్తలను పుకార్లుగా భారత అధికారులు భావిస్తున్నారు.