Home తాజా వార్తలు డోనాల్డ్ ట్రంప్-కిమ్‌ల సమావేశం రద్దు!

డోనాల్డ్ ట్రంప్-కిమ్‌ల సమావేశం రద్దు!

trup

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 12న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వైట్ హౌస్ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. కిమ్‌తో భేటీ కోసం ఎంతో ఎదురు చూశానని, కానీ కిమ్ ఇటీవల చేసిన ప్రకటనల్లో అమెరికాపై తీవ్ర ద్వేషం, శత్రుత్వం ప్రదర్శించారని, ఇటువంటి పరిస్థితుల్లో దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఈ సమావేశం అనవసరం అనిపింంచిందని ట్రంప్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.