Home అంతర్జాతీయ వార్తలు భారతీయులకు అనువుగా హెచ్1బి వీసాలో మార్పులపై ట్రంప్

భారతీయులకు అనువుగా హెచ్1బి వీసాలో మార్పులపై ట్రంప్

Donald Trump

 

భారతీయులకు అనువుగా హె1బిలో మార్పులు : ట్రంప్

వాషింగ్టన్: హెచ్1బి వీసా ప్రోగ్రాంలో కీలకమైన మార్పులు రానున్నాయని, వీటివల్ల భారతీయ ఐటి ప్రొఫెషనల్స్. ఐటి కంపెనీలు అత్యధికంగా లాభపడతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చెప్పారు. కొత్త విధానం ఈ వీసా విధానంలో సరళతను, స్పష్టతను తీసుకు వస్తుందని, అమెరికా పౌరసత్వానికి మరింత నేరు బాటగా ఉంటుందని ఆయన చెప్పారు. నిపుణులు అవసరమైన కొన్ని ఉద్యోగాలకు అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులను తీసుకోవడానికి ఈ హెచ్ 1బి వీసా వీలు కల్పిస్తుంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన రోజునుంచీ ఈ వీసా విధానంపై పలు ఆంక్షలు విధించడమే కాకుండా, అమెరికా ఉత్పత్తిదారులు, లోకల్ ఉద్యోగులను ప్రోత్సహించే ‘ బై అమెరికా, హైర్ అమెరికా’ విధానాన్ని ప్రకటించడం తెలిసిందే. అయితే అమెరికాలో ఉండడానికి, అంతేకాకుండా అమెరికా పౌరసత్వాన్ని పొందడానికి మరింత నేరు బాటగా ఉండే విధంగా హెచ్1బి వీసా విధానంలో మార్పులు తీసుకు రానున్నాం’ అని ట్రంప్ శుక్రవారం ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

Donald Trump promises changes to H1B visas

Tlangana Latest News