Home అంతర్జాతీయ వార్తలు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

DONALDవాషింగ్టన్ : అమెరికా రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన ఆయన తాజాగా మరో కొత్తవివాదానికి తెరలేపారు. యూకే తనపై నిషేధం విధిస్తుందేమోనన్న అనుమానంతో ముందస్తు జాగ్రత్తగా ఆయన బెదిరింపులకు దిగుతున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనను నిషేధిస్తే, ఆ దేశంలోని తన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటానని బహిరంగంగా ప్రకటించారు. పారిస్ దాడులపై డొనాల్డ్ స్పందించారు. అమెరికాలోకి ముస్లింలు రాకుండా, నిషేధం విధించాలంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. డొనాల్డ్ ట్రంప్‌ను దేశంలోకి రానివ్వొద్దని యూకే ప్రజలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డొనాల్డ్‌ను దేశంలోకి రానివ్వాలా, వద్దా అనే అంశంపై యూకే ప్రభుత్వం సంతకాల సేకరణ మొదలు పెట్టింది. ఐదు లక్షల మందికి పైగా ఇందులో సంతకాలు చేశారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు జనవరి 18న యూకే ప్రభుత్వం వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో చర్చ చేపట్టనుంది. కానీ యూకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని డొనాల్డ్ ఖండించారు. తాను యూకే రాకుండా నిషేధం విధిస్తే భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రపంచానికి తప్పుడు సంకేతం ఇచ్చినట్లేనని ఆయన అన్నారు. తనను నిషేధిస్తే యూకే గోల్ఫ్ కోర్సులో తాను పెట్టిన 700 మిలియన్ యూరోల పెట్టుబడులను వెనక్కి తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.