Saturday, January 28, 2023

మీడియాపై ట్రంప్ జులుం

  • కీలక వార్తా సంస్థలకు నో ఎంట్రీ
  • స్వేచ్ఛపై దాడిగా జర్నలిస్టుల నిరసన
- Advertisement -

Donald-Trumpవాషింగ్టన్: అమెరికాలో కొన్ని వార్తా సంస్థలను అడ్డుకున్నారు. అధ్యక్షుని నివాసం వైట్‌హౌస్ బయటనుంచి బయటనే వార్తా సంస్థలను అడ్డుకోవడం అసాధారణ చ ర్యగా మారింది. వైట్‌హౌస్‌లోపలికి న్యూయార్క్ టైమ్స్, సిఎన్‌ఎన్, బిబిసి వంటి పలు వార్తా సంస్థల ప్రతి నిధులను వారి కెమెరామెన్లను రానివ్వలేదు. శ్వేతసౌధం లో రోజువారీ విలేకరుల సమావేశాల పర్యవేక్షకులు జారీ చేసిన ఆదేశాలతో ప్రెస్‌మీట్ నుంచి ఆయా వార్తా సంస్థల ప్రతినిధులను నిషేధించినట్లు అధికారులు తెలిపారు. తమ నిర్ణయాలను తప్పుపట్టే మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తోన్న ట్రంప్ ఏకంగా అధికార నివాసంలోకి మీడియా రాకుండా అడ్డుకోవడం పరిస్థితి తీవ్రతను తెలిపింది. ప్రెస్‌లో అత్యధికం అమెరికన్లకు బద్ధ శత్రువులని మీడియాపై వార్షిక రాజకీయ కార్యాచరణ సదస్సులో ట్రంప్ ప్రకటించిన తరువాత వైట్‌హౌస్ వద్ద ఈ చర్య చేపట్టారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ సీన్ స్పైసర్ మీడియా సమావేశం నుంచి బహిష్కరణ జాబితాలో ఉన్న పేర్లను చదివి విన్పించారు. ప్రెస్ బ్రీఫ్‌ను తరువాత ఆఫ్ కెమెరాగా నిర్వహించారు. కొన్ని సంస్థలను రానివ్వలేదనే వార్త తెలియగానే ప్రెస్‌మీట్ నుంచి నిరసనగా ఎపి, రాయిటర్స్, టైమ్ మ్యాగజీన్ ఇతర వార్తా సంస్థల వారు కూడా బయటకు వెళ్లిపొయ్యారు. విలేకరుల సమావేశానికి న్యూయార్క్ టైమ్స్, లాస్ ఎంజెల్స్ టైమ్స్, పొలిటికో, బజ్ ఫీడ్ ప్రతినిధులు రావడానికి యత్నించగా వారికి అనుమతి లేదంటూ అధికారులు అడ్డుకున్నారని వెల్లడైంది. మీడి యా సమావేశానికి బ్రైబర్డ్, ది వాషింగ్టన్ టైమ్స్, ఎబిసి, సిబిఎన్, ఎన్‌బిసి, ఫాక్స్ , రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థల వారికే ప్రవేశం ఉంటుందని అధికారులు చెప్ప డంతో కలకలం చెలరేగింది. తప్పుడు వార్తలను అడ్డు కోవడానికి ట్రంప్ ఏదో ఒకటి చేస్తారని, ఇందులో భాగంగానే కొందరిని రానివ్వలేదని అనుకుంటే తప్పేమీ లేదని ప్రెస్ సెక్రెటరీ స్పైసర్ వ్యాఖ్యానించారు. మీడియాకు అనుమతి నిరాకరణగా దీనిని భావించ రాదని వైట్‌హౌస్ మహిళా ప్రతినిధి సారా సాండర్స్ తెలిపారు. అందరికీ అన్ని విధాలుగా వైట్‌హౌస్ నుంచి తగు వార్తా వినిమయం జరుగుతుందని, దిగులు చెందవద్దని వ్యాఖ్యానించారు. అందరికీ వార్తలు అందే రీతిలోనే తాము కొన్ని సంస్థలకు ఆహ్వానం పలికినట్లు వివరించారు. తరువాత తరువాత ఈ జాబితాలో ఏ ఏ సంస్థను పిలవాలనేది ఖరారు చేసుకుంటామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles