Saturday, January 28, 2023

ట్రంప్ ప్రమాణం నేడే

  • మన రాత్రి 10.30 గం.కు అమెరికా 45వ అధ్యక్షుడుగా ప్రమాణస్వీకారం
- Advertisement -

Donald-Trumpవాషింగ్టన్ : అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్ డిసిలోని అమెరికా కాపిటల్ భవనం మెట్లపై ఆయన ప్రమాణం చేయనున్నారు. తదనం తరం ట్రంప్ అధికార నివాసం వైట్‌హౌస్‌లోకి కుటుంబసమేతంగా అడుగుపెట్టనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30గంటలు) ట్రంప్‌తో 45వ అధ్యక్షునిగా అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్ ప్రమాణం చేయిస్తారు. ట్రంప్‌కు ముందు ఉపాధ్యక్షునిగా మైకేల్ పెన్స్ ప్రమాణం ఉంటుంది. అనంతరం ట్రంప్ ప్రసంగం చేస్తారు. ఒబామా వీడ్కోలు కార్యక్రమం ముగిశాక, ట్రంప్ తొలిసారి అమెరికా కాంగ్రెస్ మధ్యాహ్న భోజన విందులో పాల్గొంటారు. తర్వాత అధ్యక్ష ప్రారంభోత్సవ పరేడ్‌లో పాల్గొంటారు. వెంటనే ప్రమా ణం చేసిన ప్రదేశం కాపిటల్ నుంచి ట్రంప్ తన కాన్వాయ్‌తో పెన్సిల్వే నియా అవెన్యూ గుండా శ్వేతసౌధానికి చేరుకుంటారు. లీప్ సంవత్స రం నవ ంబర్‌లో అమెరికా అధ్యక్షునిగాఎన్నికైన అభ్యర్థి జనవరి 20న ప్రమాణం చేసే సంప్రదాయం 1937లో ఆరంభమైంది. దేశ 32వ అధ్య క్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ రెండోసారి 1936లో ఎన్నికయ్యాక జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు వరకూ మార్చి 4న(అమెరికా రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు) కొత్త అధ్యక్షుడు ప్రమాణం చేయడం సంప్రదాయంగా 140 ఏళ్లు కొనసాగింది.
వేదికపై మనస్వీ..
బాలీవుడ్ నటి, మోడల్ మనస్వీ మాంగాయి అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్ ట్రంప్ కూర్చొనున్న వేదికపై కనిపించనుంది. ఆయనకు స్వాగతం చెబుతూ నిర్వహించే ఉత్సవానికి బాధ్యత వహించడమే కాకుండా అదే వేదికపై ఆడిపాడనుంది. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో బాలీవుడ్ నుంచి మనస్వీ మొదటి నుంచి పాల్గొంది. ఆ తర్వాత శుక్రవారం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ కోసం స్వాగత కార్యక్రమంలో పాలుపంచు కోనుంది. ఈ కార్యక్రమాన్ని లింకన్ మెమోరియల్ వద్ద నిర్వహించను న్నారు. బాలీవుడ్‌లో హిట్ సాంగ్స్‌గా పేరొందిన కాలా చష్మా, జుమ్మేకి రాత్, ధూమ్ మాచాలే, జయహో వంటి గీతాలను ప్రదర్శించనున్నారు. మరోవైపు ట్రంప్ ప్రమాణస్వీకారాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న వారు ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు. అలాంటి వారిని అడ్డుకునేందుకు ముందుగానే కటుటదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles