భారత్‌లో యాపిల్ విస్తరణ వద్దని టిమ్‌కుక్‌కు
చెప్పా అక్కడ ఐ ఫోన్లు తయారు చేయడం
నాకు ఇష్టం లేదు భారత్‌లో వ్యాపారం
కష్టమని చెప్పా సుంకాలు లేని వాణిజ్యాన్ని
భారత్ ప్రతిపాదించింది దోహాలో
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన
వ్యాఖ్యలు సున్నా సుంకాలపై ఇంకా
ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న
విదేశాంగశాఖ మంత్రి జైశంకర్
న్యూఢిల్లీ : భారతదేశంలో యాపిల్ ఉత్పత్తులను విస్తరించవద్దని ఆసంస్థ సిఈఓ టి మ్ కుక్ కు తాను చెప్పినట్లు అమెరికా ప్రె సిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. దో హాలో ఒక బిజినెస్ కార్యక్రమంలో పా ల్గొ న్న ట్రంప్ యాపిల్ సిఈఓ టిమ్ కుక్ ను కలిసినప్పుడు ఆ సంస్థ భారతదేశం అం తటా తన ఉత్పత్తులను విస్తరించే ఆలోచన ఉన్నట్లు తెలిసిందని, అయితే భారతదేశంలో యాపిల్ విస్తరించాలని తాను కోరుకోవడం లేదని ఆయన కు చెప్పినట్లు ట్రం ప్ వివరించారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాలలో భారతదేశం ఒకటి అనీ, అందువల్ల భారతదేశంలో అమెరికన్ ఉత్పత్తులు అమ్మ డం చాలా కష్టమని ట్రంప్ అన్నారు. యాపిల్ సంస్థ చైనాలో ఎన్నో ప్లాంట్లను నిర్మించినా తాము సహించామని, భా రతదేశంలో యాపిల్ ప్లాంట్లు నిర్మించడం తమ కు ఇష్టంలేదని, భారతదేశం తన అభివృద్ధిని తా నే చేసుకుంటుందని టిమ్ కుక్‌కు వివరించినట్లు ట్రంప్ వివరించారు. సి ఈఓ తో తన సంభాషణ తర్వాత అమెరికాలో యాపిల్ తన ఉత్పత్తిని పెంచనున్నట్లు ట్రంప్ చెప్పారు.
తన చర్చల త ర్వాత భారతదేశంలో ఆపిల్ ప్రణాళికల్లో ఏమై నా మార్పు లు ఉంటాయా అన్న అంశాన్ని మా త్రం ట్రంప్ వివరించలేదు. భారత ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై అమెరికా సుంకాలను పెం చినందుకు ప్రతి స్పందనగా అమెరికాపై ప్ర తీకార సుంకాలను విధిస్తామని భారతదేశం హె చ్చరించిన కొద్దిరోజుల తర్వాత ట్రంప్ ఈ రకమై న వ్యా ఖ్యలు చేశారు.ఈ మద్య కొన్ని ఉద్రిక్తతలు ఎదురైనప్పటికీ, భారత్ – అమెరికా మధ్య వాణి జ్య చర్చ లు ఇంకా కొనసాగుతున్నాయి. రెండు దేశా లు ఒప్పందాలను కుదుర్చుకునే దిశగా కృషి చేస్తున్నాయి.మరో విశేషం ఏమిటంటే.. దోహాలో అదే ప్రసంగంలో ట్రంప్ అమెరికా వస్తువులపై సుంకాలను తొలగించే ప్రతిపాదనను భారతదేశం అందించినట్లు ట్రంప్ ప్రకటించారు.ఆపిల్ కొన్ని ఏళ్లుగా భారతదేశంలో తమ తయారీ ప్రక్రియను క్రమం గా పెంచుతోంది. ఫాక్స్ కాన్ , విస్ట్రాన్ వంటి కాం టాక్ట్ తయారీదారుల ద్వారా కంపెనీ దేశంలో అ నేక ఐఫోన్ మోడళ్లను తయారు చేస్తోంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం అనే భారత విధానాలకు అనుగుణంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నది.
సున్నా సుంకంపై నిర్ణయం తీసుకోలేదు
అమెరికా ఉత్పత్తులపై జీరో టారిఫ్ ఆఫర్‌పై ఇం కా ఏమీ నిర్ణయం కాలేదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేసారు.అమెరికాతో వాణి జ్య చర్చలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, ఆ చ ర్చలలో తుది నిర్ణయం జరగలేదని ఆయన అ న్నా రు. చర్చలలో చాలా చిక్కుముడులు ఉన్నాయ ని, ప్రతి అంశం పై నిర్ణయం జరిగేవరకూ ఏమీ చె ప్పలేమని, ఏదైనా వాణిజ్య ఒప్పందం పరస్పరం ప్ర యోజనకరంగా ఉండాలని, అప్పుడే ఉభయ దే శాలకు ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి అ న్నారు. వాణిజ్య ఒప్పందం విషయంలో భారతదే శం అదే కోరుతున్నట్లు మీడియాకు తెలిపారు. ట్రంప్ దోహాలో మాట్లాడుతూ భారతదేశం అమెరికాకు సున్నా సుంకాలతో వాణిజ్య ఒప్పందాన్ని అందించిందని ప్రకటించిన కొద్ది సేపటికే జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.