Home Default ప్లాస్మా దానం చేయండి : మహేశ్ బాబు

ప్లాస్మా దానం చేయండి : మహేశ్ బాబు

Donate Plasma To Corona Patients : Mahesh Babuహైదరాబాద్  : కరోనా విజేతలు ప్లాస్మా దానం చేయాలని సూపర్ స్టార్ మహేశ్ బాబు తన అభిమానులను కోరారు. కరోనా నుంచి కోలుకున్న వారు ఇతర కరోనా రోగులకు ప్లాస్మా దానం చేస్తే ఎటువంటి నష్టం జరగదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం మహేశ్ బాబు తన 45వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు ఓ లేఖ రాశారు. ప్లాస్మా దానం చేసిన వారికి మహేశ్ బాబు ధన్యవాదాలు తెలిపారు. ప్లాస్మా దానంపై సైబరాబాద్ పోలీసులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ప్లాస్మా దానం చేస్తే తిరిగి కరోనా సోకే ప్రమాదం ఉందన్నది ఒట్టి అపోహ మాత్రమేనని మహేశ్ బాబు తేల్చి చెప్పారు. కరోనా విజేతల్లో ఒక్కరు చేసే ప్లాస్మా దానంతో 30 మంది కరోనా రోగులను కాపాడవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్లాస్మా దానంపై  అభిమానులు ప్రజల్లో అవగాహన కలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.