Home జాతీయ వార్తలు ఏ పరిశ్రమనైనా ప్రత్యేకంగా ప్రోత్సహించారంటే చంపేసినట్టే

ఏ పరిశ్రమనైనా ప్రత్యేకంగా ప్రోత్సహించారంటే చంపేసినట్టే

శాసించడాన్ని విధానకర్తలు మానుకోవాలి
విలువను తగ్గించాలనే డిమాండ్ సరికాదు
గవర్నర్ రఘురాం రాజన్

RAGHUలండన్ : మరోసారి ప్రభుత్వ విధానాలపై ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) గవర్నర్ రఘురాం రాజన్ తనదైన శైలిలో వి రుచుకుపడ్డారు. కొన్ని రంగాలకు ప్రత్యేకించి రాయితీలు వం టి ప్రోత్సాహకాలు అందివ్వడాన్ని ఆయన గట్టిగా వ్యతిరేకించా రు. ఏ పరిశ్రమనైనా ప్రోత్సహించే ప్రయత్నం చేశారంటే అది ఖచ్చితంగా వాటిని చంపడమేనని, ఎలా వ్యాపారం చేయాలో శాసించడాన్ని విధానకర్తలు మానుకోవాలంటూ రాజన్ సూచిం చారు. గతంలో గుడ్డివాళ్ల రాజ్యానికి ఒంటి కన్నువాడే రాజు అ ని భారత్ ఆర్థిక వ్యవస్థను అభివర్ణిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. త్వరలో పదవీ విరమణ చేయనున్న ఆయన, ఇటీవల ఓ స్నాతకోత్సవంలో పాల్గొని నకిలీ డిగ్రీల ఉ చ్చులో పడొద్దంటూ విద్యార్థి లోకానికి హెచ్చరికలు కూడా చేశా రు. తాజాగా బ్రిటన్‌లో కేంబ్రిడ్జి యూనివర్శిటీలోనూ పలు అం శాలపై రాజన్ ప్రసంగించారు. వస్తువుల ఎగుమతులను బలో పేతం చేయడానికి రూపాయి విలువను తగ్గించాలంటూ పరిశ్ర మ సంఘాలు తరచూ అధికార యంత్రాంగాలకు డిమాండ్ చేయడాన్ని కూడా ఆయన సరైంది కాదన్నారు. దేశీయ వ్యాపా రానికి అనుగుణంగా కరెన్సీ విలువను అవసరాలకు తగ్గట్టుగా తగ్గించుకునేది కాదని అన్నారు. 2015 సంవత్సరం ప్రారంభం నుంచి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సుమారు 6 శాతం తగ్గిందని, అయినా ఇతర దేశాల కరెన్సీ విలువ కూడా పడిపోవడంతో ఇది ఏ మాత్రం వస్తు ఎగుమతులకు దోహదం చేయలేదన్నారు. ఇతర దేశాల కంటే భారత్‌లో ద్రవ్యోల్బణం ఇప్పటికీ అధికంగానే ఉందని, పోటీతత్వానికి మారక రేటు మాత్రమే కొలమానం అని అన్నారు. ఫ్యాక్టరీల నుంచి రై లు ముఖ్య కేంద్రాలకు మెరుగైన రోడ్డు నిర్మాణంతో భార త్‌లో ఉత్పత్తి రంగం వృద్ధి దిశలో ఉందని తెలిపారు. వృ ద్ధి పథాన నడి చేందుకు ఆర్థిక స్థిరత్వం కోసం భారత్ ప్రయత్నాలు చేస్తోందని, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థి తుల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడకుండా చర్య లు తీసుకోవాల్సి ఉందన్నారు. అభివృద్ధి చెందిన దే శాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోందని, ఇటు వంటి పరిస్థితుల్లో భారత్‌కు రెండంకె ల వృద్ధి రేటుకు గడ్డు పరిస్థితులు ఉంటాయని అ న్నారు. ధరలు పడిపోవడం వల్ల అనేక దేశాల కమోడిటీ ఎగుమతులు దెబ్బతి న్నాయని. ఇటీవల ఇండియా వస్తు ఎ గుమతులు ఇతర అభివృద్ధి చెందు తు న్న దేశాల కంటే దారుణంగా మారా యని రాజన్ అన్నారు. అదే సమయ ంలో భారత్ సేవల ఎగుమతులు మె రుగ్గా ఉన్నాయని, బహుశా అమెరి కా నుంచి డిమాండ్ ఉండడం వల్లే అయి వుంటుందని అన్నారు. దిర్ఘకాలిక పెట్టుబడుల రాకపై ఆర్‌బిఐ దృష్టి పె ట్టిందని, రూపాయి వర్సెస్ ఇతర కరె న్సీల కదలికలను ఎప్పటి కప్పుడు గ మనిస్తున్నామని రాజన్ వివరించారు.

బ్యాంకులపై విశ్వసనీయత తగ్గుతోంది

భారతీయ బ్యాంకులపై విశ్వసనీయత తగ్గుతోందని రాజన్ వ్యాఖ్యానించారు. అవసరం లేకపోయినా స హాయం కావాలంటూ ఏడవడం వల్ల బ్యాంకులపై నమ్మకం పోతోందని అన్నారు. దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమ లు పెద్దఎత్తున పుట్టుకు వస్తుండటం శుభపరిణామమని అ న్నారు. కేంబ్రిడ్జ్ వర్శిటీలో వై బ్యాంక్స్? అనే అంశంపై ఆయ న ప్రసంగించారు. సంక్షోభం పరిస్థితులు రాకుండా మూలధ నం నిల్వలు తరిగిపోకుండా కాపాడాల్సిన బాధ్యత బాధ్యత బ్యాంకులపైనే ఉన్నదని, ఆర్థికమాంద్యం నుంచి పూ ర్తి స్థాయి లో గట్టెక్కాలంటే తప్పనిసరని అన్నారు. రుణాల మంజూరు లో ముందు జాగ్రత్తలూ తీసుకుంటే ఎటువంటి ఎగవేతలూ ఉండవని అభిప్రాయపడ్డారు. రుణ మంజూరులో ఉన్న రిస్క్ ను బ్యాంకులు గణనీయంగా తగ్గించుకోవాల్సి వుందన్నారు. గతంలో ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్‌గా కూడా విధులు నిర్వ హించిన రాజన్ భారత్‌లో క్రెడిట్ రేటింగ్ బిఎ ఎ(అధిక రిస్క్) ఉందని అన్నారు. ఈ కారణంగానే విదేశీ బ్యాంకులు కొత్త శా ఖలను ప్రారంభించేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదని అ న్నారు. అంటే, ఇండియాలో డబ్బు తెచ్చి పెడితే, అది తమకు లా భించదని అంతర్జాతీయ బ్యాంకులు భావిస్తున్నట్టని, దీనివల్లే వారు పక్కకు తప్పుకుంటున్నా రని అన్నారు. ఈ పరిస్థితి మరింతగా దిగజారకుండా చూసుకోవాల్సి వుందని అభిప్రాయపడ్డారు.