Thursday, March 28, 2024

కరోనాపై భయాలొద్దు

- Advertisement -
- Advertisement -

 Coronavirus

 

వదంతులు నమ్మొద్దు, కేంద్ర బృందం పరిశీలిస్తోంది

నేడు ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతాం – మంత్రి ఈటల

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ వైరస్ విషయంలో వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందొద్దని చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని విషయాలను పర్యవేక్షణ చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కరోనా వైరస్‌పై బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామని ఈటల రాజేందర్ తెలిపారు. కేంద్ర వైద్యుల బృందం హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పర్యటిస్తుందన్నారు. ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ప్రజలు భయపడొద్దు అని మంత్రి సూచించారు.

ఫీవర్ ఆసుపత్రిని పరిశీలించిన కేంద్ర బృందం
కేంద్ర వైద్యుల బృందం మంగళవారం ఫీవర్ ఆసుపత్రిని సందర్శించి, ఆసుపత్రిలోని ఐసోలేటేడ్ వార్డులను, కరోనా వైరస్ అనుమానితుల చికిత్స వార్డులను కేంద్ర వైద్యుల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండ్ శంకర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు. అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి పరిక్షల కోసం పుణెలోని ల్యాబ్‌కు పంపిస్తే నెగటివ్‌గా తేలిందని అన్నారు. మంగళవారం మూడు కేంద్ర ప్రత్యేక వైద్య బృందాలు ఫీవర్ హాస్పిటల్ సందర్శించాయని, చైనా నుంచి వచ్చిన ఇద్దరు అనుమానితులను ఫీవర్ ఆసుపత్రిలో పరిక్షించారని పేర్కొన్నారు. కరోనా వైరస్ సంబంధించి తగు సూచనలు సలహాలు ఇచ్చారని తెలిపారు. ఫీవర్ హాస్పిటల్‌లో 40 పడకలతో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారు ఆసుపత్రి వైద్యులను సంప్రదించాలని సూచించారు.

చైనాలో 106కు చేరిన కరోనా మృతులు
కరోనా వైరస్ వల్ల తాజాగా 24 మంది మృతిచెందారు. దాంతో చైనాలో ఆ వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 106కు చేరుకున్నది. కరోనా వైరస్ సోకిన బాధితులు న్యుమోనియా వ్యాధితో మరణిస్తున్నారు అయితే ఆ వైరష్ సుమారు 4,515 మందికి సోకినట్లు తాజాగా అధికారులు నిర్థారించారు. ఒక టిబెట్ మినహా, మిగతా చైనా ప్రానిన్సుల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. థాయిలాండ్, జపాన్, దక్షిణ కొరియా, అమెరికా, వియత్నాం, సింగపూర్, మలేషియా, నేపాల్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, శ్రీలంక దేశాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేంద్ర బిందువైన హుబెన్ ప్రావిన్స్‌లో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది.

విమానాశ్రయాల్లో అప్రమత్తత
చైనాను వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ భారత్‌లో ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిన్ విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను పరీక్షిస్తున్నారు. కరోనా వైరస్‌కు సంబంధించి ఇప్పటివరకు ఏ ఒక్క కేసు నమోదు కాలేదని పేర్కొంది. చైనాలోని భారత రాయబార కార్యాలయం తమకు ఈ వైరస్‌కు సంబంధించిన తాజా వివరాలను క్రమం తప్పకుండా అందజేస్తోందని భారత ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుదన్ తెలిపారు.

కరోనా వైరస్ రాకుండా ఏం చేయవచ్చు
కరోనా వైరస్ రాకుండా ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు సాధారణ ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సూచించింది. వీటిలో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్ ధరించడం, ఆహార జాగ్రత్తలు ఉన్నాయి. శ్వాస ఇబ్బందులు ఎదుర్కుంటున్న రోగులకు దగ్గరగా ఉండకూడదని సూచించారు. తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలని, ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి, పెంపుడు జంతువులు, లేదా ఇతర జంతువులకు దూరంగా ఉండాలని చెప్పింది. పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకుండా ఉండాలని సూచించింది. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినవారు తుమ్ముతున్న సమయంలో ఎదురుగా ఉన్నవారికి అది రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పింది.అంటే ముక్కుకు టిష్యూ లేదా బట్ట పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి.

Don’t believe rumors on Coronavirus
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News