Home జగిత్యాల భూ హద్దు సమస్యలు తీరేదెప్పుడో..!

భూ హద్దు సమస్యలు తీరేదెప్పుడో..!

don't care revenue officials

చలానా కట్టి నెలలు గడిచినా మోకా మీదికి రాని సర్వేయర్లు
జిల్లాలో వందల సంఖ్యలో పెండింగ్ దరఖాస్తులు                                                                                                      భూముల హద్దు సమస్యలతో సతమతమవుతున్న రైతాంగం                                                                                          పట్టించుకోని రెవెన్యూ ఉన్నతాధికారులు

భూముల ధరలు రోజు రోజుకు పెరుగుతున్న దృష్టా హద్దుల సమస్యలు కూడా అధికమవుతున్నాయి. “దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని” చందంగా భూముల హద్దుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రభుత్వం సర్వేయర్లను నియమించినా హద్దు సమస్యలు పరిష్కరించడంలో వారు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు.అమ్యామ్యాలు ఇవ్వనిదే అటు వైపు కన్నెత్తి కూడా చూడమని ఖరాఖండిగా చెబుతున్నారు. దాంతో అడిగినంత ఇచ్చిన వారికి ఆఘమేఘాల మీద హద్దులు నిర్ణయించడం… ముడు పులు ఇవ్వని వారిని నెలల కొద్దీ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం పరిపాటిగా మారింది. ఈ విషయం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించు కోకపోవడంతో రైతుల కష్టాలు రోజు రోజుకు పెరుగు తున్నాయే తప్పా తీరడం లేదు. 

జిల్లా కలెక్టర్ శరత్

మనతెలంగాణ/జగిత్యాల: హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వర్షాకాలంలోనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర డాక్టర్ ఎ.శరత్ అన్నారు. గురువారం ఆర్‌డిఓ కార్యాలయ సమావేశ మందిరంలో జి ల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ,హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందు కు అవసరమైన మొక్కలను అధికారులకు నర్సరీల నుంచి తెప్పించుకోవాలన్నారు.నర్సరీల్లో లభించని మొక్కలను కొనుగోలు చేయాలని సూచించారు.విద్యుత్ శాఖ అధికారులు జిల్లాలోని సబ్ స్టేషన్‌లలో ఎ న్ని మొక్కలు నాటాలో అంచనా వేసి అందుకు అనుగుణంగా మొ క్కలు నాటాలన్నారు. కాలానుగుణంగా ఉండే పండ్ల మొక్కలను ఎక్కువగా నాటాలని సూచించారు. హరితహారంలో బాగా పని చేసిన వారికి ఆగస్టు 15న ప్రోత్సహక బహుమతులు అందజేస్తామన్నారు. హరితహారం కార్యక్రమంపై సోషల్ ఆడిట్ చేయిస్తామని, ఎక్కడైనా అక్రమా లు జరిగినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కెజిబివి, రెసిడెన్షియల్,మోడల్ స్కూళ్లలో వివిధ రకాల పండ్ల మొక్కలు నాటేలా చ ర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు మూడు మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలను అప్పగించాలన్నారు.పాఠశాలలకు వెళ్లే దారిలో సైతం రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నా టాలని, మన ఇళ్లల్లో మొక్కలను ఏ విధంగా చూసుకుంటామో పాఠశాలల్లో నాటిన మొక్కలను కూడా అలాగే చూసుకోవాలన్నారు. పాఠశాలల్లో అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుకు అందరూ కృషి చేయాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కూడా ఖచ్చితంగా మొ క్కలు నాటి వాటికి ట్రీ గార్డులు ఏర్పాటు చేసి సంరక్షించాలన్నారు. స ంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి హరితహారం విజయవంతానికి కృషి చేయాలన్నారు. జూనియర్, డిగ్రీ కళాశాలల్లో కూడా మొక్కలు నాటేలా ఎంఇఒ డిఆర్‌డిఓ బాధ్యతలు తీసుకోవాలన్నారు.జిల్లాలోని మూడు బస్‌డిపోలు, బస్టాండ్‌ల వద్ద మొక్కలు నాటాలని, ప్రహారీ చుట్టూ ట్టూ మొక్కలు నాటాలన్నారు.నాటిన మొక్కలను తొలగించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.జిల్లా, మండల, గ్రామ స్థాయిలో బీద వారికి చెట్లు ఇచ్చి వారికి చెట్టు పట్టా కూడా ఇస్తామన్నా రు. ధర్మపురి దేవస్థానానికి రెండెకరాల స్థలాన్ని ఇస్తామని, అందులో మొత్తం దేవాలయానికి అవసరమైన పూలు, పండ్ల మొక్కలను సిబ్బందితో నాటించేలా చూడాలని, కొండగట్టు దేవస్థానానికి ఇప్పటికే 330 ఎకరాల స్థలాన్ని ఇచ్చినందును విరివిగా మొక్కలు నాటాలని కలెక్టర్ సూచించారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉండే అన్ని దేవాలయాల్లో, జెఎన్‌టియులో హరితహారంలో మొ క్కలు నాటించేలా ఆర్‌డిఒ,ఇఓ పిఆర్‌డి రమేశ్‌లు పర్యవేక్షించాలని ఆ దేశించారు. ఈ పనులను ఈ నెల 30లోగా పూర్తి చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు పట్టణ ప్రాంతాల్లో విరివిగా పండ్ల మొక్కలు నా టించాలని, అన్ని ప్రాంతాల్లో మొక్కలు నా టేలా చ ర్యలు తీసుకోవాలన్నారు. జగిత్యాల ఎస్‌ఆర్‌ఎస్‌పి కాల్వ నుంచి తాటిపల్లి వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేలా రోటరీక్లబ ఐ ఎంఏ, రైస్‌మిల్లర్లకు బాధ్యతలు అప్పగించాలని అధికారులను కోరారు.ఎస్‌ఆర్‌ఎస్‌పి కాల్వ వెంబడి, అన్ని అరోగ్య కేంద్రాల వ ద్ద మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలన్నారు.
నీటి సమస్యలు ఉన్న చోట నీటి తొట్టిలను ఏర్పాటు చేసుకోవాలని,ఈ నెల 30 లోగా జిల్లాలో 100శాతం హరితహారం పూర్తయ్యే లా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి న ర్సింహారావు, డిఆర్‌డిఏ పిడి అరుణశ్రీ, ఆర్‌డిఓ నరేందర్, ఎపిడి లక్ష్మీనారాయణ, ము న్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓ లు, విద్యాశాఖ అధికారులు,వివిధ శాఖల జి ల్లా అధికారులు పాల్గొన్నారు.