Home తాజా వార్తలు అబద్ధాల బాబుకు ఓటేయకండి : జగన్

అబద్ధాల బాబుకు ఓటేయకండి : జగన్

JAGAN

కాకినాడ : అబద్ధాలతో కాలం గడుపుతున్న ఎపి సిఎం, టిడిపి చీఫ్ చంద్రబాబుకు ఓటేయవద్దని వైఎస్‌ఆర్‌సిపి చీఫ్ జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆదివారం అన్నమ్మఘాట్‌లో వైఎస్‌ఆర్‌సిపి నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. మూడున్నరేళ్ల తన పాలనలో చంద్రబాబు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు మైక్ పట్టుకుంటే వినిపించేవన్నీ అబద్ధాలేనని ఆయన ఎద్దేవా చేశారు. రేషన్ షాపుల్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. నిరుద్యోగ భృతి హామీని చంద్రబాబు ఎప్పుడో మర్చిపోయారని ఆయన విమర్శించారు. ప్రతి కుటుంబానికి ఆయన సుమారు ఎనబై వేల రూపాయలు బాకీ పడ్డారని జగన్ పేర్కొన్నారు. మూడున్నరేళ్ల తన పాలనలో బాబు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్నారు. బాబుకు ఓటేస్తే పాలన మరింత అవినీతి మయమవుతుందన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థులనే గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

Dont give Vote to Chandrababu