Thursday, April 25, 2024

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు పెంచొద్దు

- Advertisement -
- Advertisement -

sabitha indrareddy

 

మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే విద్యాసంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులు పెంచరాదని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వ అనుమతులు రద్దు చేయడంతోపాటు కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు అమలు చేసేందుకు సోమవారం తన కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఫీజుల రూపంలో కాకుండా ఇతర రూపాలలో తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసినా గుర్తింపు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కోవిడ్19 కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆదాయాన్ని కోల్పోయారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మానవతా దృక్పధంతో వ్యవహరించాలని కోరారు. సంవత్సరంలో ప్రతి నెలా ఫీజులు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రైవేట్ యాజమాన్యాలకు సూచించారు. సంవత్సరం ఫీజును ఒకే సారి చెల్లించాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేయవద్దని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినట్లు తేలితే వెంటనే గుర్తింపు రద్దు చేసేలా చూడాలని ఆదేశించారు. ఎక్కడైనా విద్యాసంస్థలు విద్యార్థులనుగానీ, తల్లిదండ్రులనుగానీ ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారరు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా కలిసి రావాలని కోరారు.

నేటి నుంచి డిజిటల్ తరగతులు ప్రారంభం
లాక్‌డౌన్ నేపథ్యంలో విద్యార్థులు తమ విలువైన సమయాన్ని కోల్పోకుండా 6 నుంచి 10 తరగతుల వరకు డిజిటల్ పాఠాలను టి సాట్ ద్వారా ప్రసారం ,ఏయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ నెల 21 నుంచి ప్రతి రోజూ ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి డిజిటల్ పాఠాలను ప్రసారం చేస్తున్నామని, విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించిన టిసాట్ యాప్(ఇ లెర్నింగ్)లో 6 నుంచి 10 తరగతులకు సంబంధించిన 513 పాఠ్యాంశాలను పొందుపరిచామని తెలిపారు. విద్యార్థులు తమ సమయానుకూలంగా ఇష్టమైన సబ్జెక్టులను, పాఠాలను పొందవచ్చని అన్నారు.

టిసాటఃవ ద్వారా ప్రసారమవుతున్న డిజిటల్ పాఠాలను విద్యార్థులందరూ వారి ఇంటి వద్దే ఉంటూ వీక్షించే విధంగా చర్యలు చేపట్టాని మంత్రి పేర్కొన్నారు. ఎస్‌సిఇఆర్‌టి వెబ్‌సైట్‌లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను ఈ టెక్ట్ రూపంంలో అందుబాటులో ఉంచామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, టిసాట్ సిఇఒ శైలేష్‌రెడ్డి, ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్ శేషుకుమారి, ఎస్‌ఐఇటి డైరెక్టర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Don’t increase Private School Fees
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News