Home తాజా వార్తలు నిందితులను వదలం : కడియం

నిందితులను వదలం : కడియం

Kadiyam-Srihari

వరంగల్ : కార్పొరేటర్ మురళీ హత్య కేసులో నిందితులను వదలమని, నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామని తెలంగాణ డిప్యూటీ సిఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ప్రజా బలం ఉన్న నేతను కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంజిఎం మార్చురీలో ఉన్న మురళీ మృతదేహాన్ని ఆయన సందర్శించారు. మురళీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మురళీ కుటుంబానికి పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందని కడియం చెప్పారు. కడియంతో పాటు ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వినయ్ భాస్కర్, పలువురు కార్పొరేటర్లు ఉన్నారు.

Dont leave the Accused in Murali Murder Case : Kadiyam