Home తాజా వార్తలు కెసిఆర్‌ను ఉద్దేశిస్తూ హరీష్‌రావు ట్వీట్

కెసిఆర్‌ను ఉద్దేశిస్తూ హరీష్‌రావు ట్వీట్

Door-to-door survey starts in telangana

 

హోం ఐసోలేషన్ చికిత్సా విధానాన్ని కేంద్రం, నీతి ఆయోగ్ గుర్తించింది
సిఎం కెసిఆర్‌ను ఉద్దేశిస్తూ మంత్రి హరీశ్ ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్ : ‘మీ ప్రణాళిక వేలాది మందిని కాపాడింది. నీతి అయోగ్, కేంద్రం మిమ్మల్ని ప్రశంసించింది. కోవిడ్ సంక్షోభ పరిష్కారంలో మీరు అనుసరించిన ప్రణాళిక, వ్యూహం వేలాది మంది ప్రాణాలను కాపాడింది. హోం ఐసోలేషన్ ట్రీట్‌మెంట్‌లో మీరు సూచించిన విధానాలు ప్రజలను కోవిడ్ కోరల నుంచి రక్షించాయి. దీనిని కేంద్రం, నీతి అయోగ్ గుర్తించింద’ని. సిఎం కెసిఆర్‌ను ఉద్దేశించి మంత్రి తన్నీరు హరీష్‌రావు ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి నీతి అయోగ్, కేంద్రం అందజేసిన ప్రశంసాపత్రాలను మంత్రి హరీష్‌రావు తన ట్విట్టర్‌లో ట్యాగ్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో ఫీవర్ సర్వే విధానానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తద్వారా కోవిడ్ బారిన పడిన ప్రజానీకాన్ని గుర్తించి వారిని 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండమని ఆదేశాలివ్వడంతో పాటు.. ప్రతి నిత్యం సదరు కోవిడ్ బారిన పడిన బాధిత ప్రజానీకాల యోగక్షేమాన్ని తెలుసుకోవడంతో పాటు వారికి 14 రోజుల పాటు సరిపడా హోం ఐసోలేషన్ కిట్స్ అందించడంతో వేలాది మంది కరోనా రక్కసి కోరల నుంచి బయటపడ్డారు.

సరైన సమయంలో తెలంగాణ ప్రభుత్వం వేగంగా స్పందించి సత్వర చర్యలను వేగవంతం చేయడంతో పాటు కరోనా వ్యాప్తి ప్రబలకుండా సకల చర్యలు తీసుకున్నారు. దీంతో కరోనా సెకండ్ వేవ్‌లో వేలాది మంది ప్రాణాలను ప్రభుత్వం రక్షించగలిగింది. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ను మంత్రి హరీష్‌రావు ట్విట్టర్ ద్వారా అభినందించారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తరుణంలో సిఎం కెసిఆర్ సూచన మేరకు ఫీవర్ సర్వే నిర్వహించడంతో పాటు కరోనా బాధితులను గుర్తించి వారికి హోం ఐసోలేషన్ కిట్స్ అందజేసి హోం ఐసోలేషన్‌కు తరలించడం జరుగుతోందని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.

Door-to-door survey starts in telangana