Tuesday, March 21, 2023

పిల్లల బంగారు భవిష్యత్ కోసమే చుక్కలు

- Advertisement -

etela

*దేశంలో పోలియో కేసులు ఎక్కడా
నమోదు కాలేదు
*ప్రతి ఆరు నెలలకు ఒకసారి
పోలియో చుక్కలు
*ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంక్షేమ పథకాలు
*రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్

మనతెలంగాణ/కరీంనగర్‌టౌన్: పోలియో రహిత సమా జ నిర్మాణం కోసం,దేశంలో పోలియోను శాశ్వతంగా ని ర్మూంలించుటకే ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమా న్ని నిర్వహిస్తుందని, రెండు చుక్కలు చిన్నారుల నిండు జీ వితాల్లో వెలుగులు నింపుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మ ంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం నగరంలోని దన్గర్ వాడీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంపి వి నోద్‌కుమార్, జడ్‌పి చైర్‌పర్సన్ తుల ఉమ, ఎంఎల్‌ఎ గం గుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణ్‌రావు, మేయ ర్ రవీందర్ సి ంగ్, కార్పొరేటర్ చల్ల స్వరూపరాణి -హ రిశంకర్‌లతో కలిసి పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో పోలియో కేసులు ఎక్కడ నమోదు కాకున్నా ప్రభుత్వం ముందు జా గ్రత్త చర్యగా దేశంలో శ్వాశతంగా పోలియోను నిర్మూలించేందుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలియో వ్యాధి ద్వారా పిల్లలు అంగవైకల్యం చెందే అవకాశాలు ఉంటాయ ని దానిని నిర్మూలించుటకే పల్స్ పోలియో చుక్కలు ప్రతి 6 నెలలకు ఒక సారి వేయడం జరుగుతుందన్నారు. ప్రతి తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల పిల్లలందరి కి తప్పని సరిపోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. పిల్లల బంగారు భవిష్యత్ జీవితాని కి బాటలు వేయాలని అన్నారు.ఆరోగ్యవంతమైన రాష్ట్ర నిర్మాణం కోసం ప్రభుత్వం అన్ని చ ర్యలు చేపడుతుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్ర భుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో సంక్షేమ పథకాల ను పిల్లల తల్లుల కోసం ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. పిల్లలందరికి పోలియో చుక్కల ను తప్పనిసరి వేయించి విజయవంతం చేయాలని అన్నారు. ఎంపి వినోద్ కుమార మాట్లాడు తూ దేశంలో శాశ్వతంగా పోలియో నిర్మూలించుటకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. పోలియో వలన పిల్లలు వికలాంగులుగా మారే అవకాశం ఉందని తెలిపారు. జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే పోలియో చుక్కలు త ప్పనిసరి వేయించాలని అన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డ ను ండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికి పో లియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఎమ్మెల్సీ నారదాస్ లక్షణ్ రావు మాట్లాడుతూ పోలియో చుక్కలు వేయించడం వలన ఆరోగ్య సమస్యలు రాకుండ ఉంటాయ ని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేష్, మున్సిపాల్ కమిషనర్ శశాంక, కార్పొరేటర్ చల్ల స్వరూపరాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రా జేశం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News