Friday, April 19, 2024

క్వారంటైన్ ఏర్పాటుకు డబుల్ బెడ్‌రూంల ఎంపిక

- Advertisement -
- Advertisement -

త్వరితగతిన అన్ని వసతులు సిద్ధం చేయాలి
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి

 

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు జిల్లా యంత్రాం గం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని, ఇ ందుకు ప్రజలు కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ఆంక్షల మేరకు మసులుకోవడం హర్షనీయమ ని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. జిల్లా కేం ద్రంలో క్వారంటైన్ ఏర్పాటుకు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ ధర్మారెడ్డి అందుకు తగ్గ వసతులు ఉన్న పలు రకాల భవనాలను మంగళవారం ప రిశీలించారు. ఇందులో భాగంగా హవేళిఘనపూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించి న డబుల్ బెడ్ రూంల ఇళ్ళల్లో పెండింగ్ ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్ర భుత్వ ఆదేశాలకు అనుగుణంగా డబుల్ బెడ్‌రూంలలో అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు చ ర్యలు తీసుకోవాలన్నారు. నీటి వసతి ఉన్న బ్లా కుల్లో తక్షణం విద్యుత్ సౌకర్యంతో పాటు పడకలు మరియు ఫ్యాన్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. నీటి వసతి లేని బ్లాకులలో కూడా నీ టిని అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాల ని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియాన్ని సందర్శించి అక్కడ ఉన్న మంచాలు, పరుపులను హవేళిఘనపూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్‌రూం నిర్మాణా ల వద్దకు తరలించేందుకు అవసరమైన ఏర్పా ట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు, పంచాయతీ రాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, మెదక్ డిఎస్పీ క్రిష్ణమూర్తితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Double bed room selected for quarantine Coronavirus
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News