Home రంగారెడ్డి అర్హులకే డబుల్ బెడ్‌రూం ఇండ్లు

అర్హులకే డబుల్ బెడ్‌రూం ఇండ్లు

లబ్ధిదారుల ఎంపిక బాధ్యత అధికారులదే
అనర్హులకు ఇండ్లు మంజూరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
పాత ఇండ్లకు కూడా బిల్లులు ఇవ్వనున్నాం
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
డబుల్ బెడ్‌రూం ఇండ్ల పనులకు శంకుస్థాపన
దసరారోజే ప్రారంభం
టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుపేదల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తోంది. అందులో భాగంగానే ఈనాడు ఇండ్లు లేని వారికోసం డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మించి, అందజేస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని ఓ మంచి పథకమే ఈ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం. సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.

MAHENDERవికారాబాద్: టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుపేదల కోసం ఎంతో కృషి చేస్తుందని అందులో భాగంగానే ఈనాడు ఇళ్లు లేని వారికోసం డబుల్ బెడ్‌రూం గదులను నిర్మించి, కేటా యిస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం విజయదశమి రోజు న వికారాబాద్ మున్సిపల్ పరిధి రామయ్య గూడ గ్రామం లో 4 ఎకరాల ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంత రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయ దశిమి రోజున నిరుపేదలకు గూడు కల్పించే కార్యక్ర మానికి శంకుస్థాపన చేసుకుంటున్నామని ఆయన అన్నా రు. నిజమైన నిరుపేద ప్రజలకే పూర్తిగా గుడిసెల్లో నివాసం ఉన్న వారికే లబ్దిదారులను ఎంపిక చేయాలని ఆయన సూచించారు. అధికారులు ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా అర్హులైన వారికే ఈ గృహాలను కేటాయించాలని కోరారు. టిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో గృహ నిర్మాణానికి ఏలాంటి హా మి ఇవ్వకున్నా డబుల్ బెడ్‌రూం గృహాలను నిర్మిస్తుందని తెలిపారు. నిరుపేద ప్రజల కోసం ప్రజా సంక్షేమ కార్యక్ర మాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఇళ్లుక ట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్న నానుడి ప్రకారం నిరుపేద ప్రజలకు పెళ్లి కోసం షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి కార్య క్రమాన్ని అమలు చేస్తుందని గృహం కోసం డబుల్ బెడ్ రూం గృహాలను నిర్మిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే బి. సంజీవరావు మాట్లాడుతూ వికారాబాద్‌కు బంగారు భవి ష్యత్తు ఉందని తెలిపారు. జిల్లా కేంద్రంగా మారితే వికారా బాద్ ఎంతగానో అభివృద్ది చెందుతుందని అన్నారు. అధికా రులు గృహ నిర్మాణ పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాల ని కోరారు. ఈ కాలనీకి కెసిఆర్ కాలనీ అని పేరుపెట్టాలని కోరారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ డాక్టర్ అలగు వర్షిణి, మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ, తహశీల్దారు గౌతంకుమార్, విద్యార్థి జెఎసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూలి శుభప్రద్‌పటేల్, కౌన్సిలర్లు విజయేందర్‌గౌడ్,శేషగిరి, అనసూజ, నాయకులు నాగేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పరిగిలో…
పరిగి : దేశంలో ఏరాష్ట్రంలో కూడా లేని ఓ మంచి పథకమే ఈ డబుల్ బెడ్ రూంల ఇళ్ల నిర్మాణమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పరిగి పట్టణం విద్యా రణ్యపురి(తుంకులగడ్డ)లో గురువారం దసరా పండగ రోజు డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల మానిపెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారంమే రూ. 5 లక్షలకు పైగా డబ్బులతో ఓ పెద్ద కుటుంబం ఉండేలా రెండు బెడ్‌రూంలు, ఓ హాలు, వంటగది, పూజ గదులతోపాటు మరుగుదొడ్లు అన్ని హుంగులతో నిరుపేదలకు ఓ విల్లా కట్టించాలన్నదే మన ముఖ్యమంత్రి, మా అందరి కళ అన్నారు. నిరుపేదలను నిజం చేసేలా ఇళ్ల నిర్మించి ఇవ్వడం నిజంగా అధృష్టమే నన్నారు. గతంలో రూ. 60 వేల లక్ష లోపు ఇళ్లు నిర్మించా రని ఇచ్చిన్నా అవి ఎటూ కాని పరిస్థితిల్లో నిర్మాణాలు అగి అసంతృప్తే ఉండేదన్నారు. బేసిమెంట్ వద్ద ఒక బిల్లు లెంటల్ లెవన్ రూఫ్ లెవన్ ఇలా విడత వారిగా బిల్లులు ఇవ్వడంలో కొంత అవినీతి వెలుగు చూసిందన్నారు. గతం లో ఇళ్లు మంజూరై బిల్లులు రాని లబ్దిదారులకు కూడా బిల్లు లు వచ్చేలా చూస్తున్నామన్నారు. అంతేకాకుండా గత ఇళ్ల లో చాలా దుర్వినియోగం జరిగిందన్నారు. అవినీతికి అస్కారమేలేకుండా నిజమైన లబ్దిదారులను గుర్తించి వారికి ఇళ్ల నిర్మించి ఇంటి తాళం చెవి ఇచ్చేలా చర్యలు చేపట్టా మన్నారు. ముఖ్యంగా లబ్దిదారులను గుర్తించాల్సిన బాధ్య త అధికారులదేనన్నారు. నిజమైన లబ్దిదారులను గుర్తించ కుండా అనర్హులకు గుర్తింస్తే అందుకు అధికారులదే పూర్తి బాధ్యత అని మంత్రి హెచ్చరించారు. ఎమ్మెల్యే, ఆర్డీఓ, తహసిల్దార్ల సమక్షంలో ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేయ డం జరుగుతుందన్నారు. అధికారులు ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేయడంలో తమ బాధ్యత సక్రమంగా నిర్వహించా లన్నారు. ఇళ్లు లేని లబ్దిదారులనుగు గుర్తించి వారందరి ఇళ్లలను ఒకే చోటు ఓ మాడల్ కాలనీలో వచ్చేలా అధికారు లు సాధ్యమైనంత వరకు కృషి చేయాలన్నారు. గతంలో అడిగిన విద్యారణ్యపురి వాగుపై వంతెన పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే టి.రాంమ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మించి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం చాలా మంచిదన్నారు. ఇళ్ల లేకుండా విద్యారణ్యపురి గుడిసెల్లో చాలా మంది ఉంటున్నారన్నారు. ఇలాంటి చోటే డబుల్‌బెడ్ రూంలు కట్టి నిర్మించి ఇచ్చేలా గతంలో ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్లానన్నారు. నియోజకవర్గానికి 400 డబుల్ బెడ్ రూం మంజూరీ చేయడం చాలా తక్కువ అని ప్రభుత్వం మరోసారి పునరాలోచించి కాస్త నెమ్మదిగానైనా 2 వేల ఇళ్ల మంజూరీ చేయాలని కోరారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తుంకులగడ్డ ఓ మాడల్ కాలనీగా మారబోతుందన్నారు. సీసీరోడ్లు, మంచినీటి ట్యాంకు, విద్యుత్ సౌకర్యం మెరుగుపరచడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా తుంకులగడ్డలో అంగన్‌వాడీ కేంద్రం, ఓపాఠశాలను కూడా ఏర్పాటు చేసేలా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం విద్యార ణ్యపురిలో వికలత్వం ఉన్నా వారికి పింఛన్ ఇవ్వ డంలో అధికారులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేయగా, పింఛన్లు వచ్చేలా చూడాలని ఆర్డీఓకు సూచించా రు. ఈ కార్యక్రమంలో పరిగి సర్పంచ్ అంతిగారి విజయ మాల, చేవెళ్ల ఆర్డీఓ చంద్రమోహన్, డిప్యూటి ఎమ్మార్వో కృష్ణ, జిల్లా కోఆప్షన్ సభ్యులు మీర్‌మహూమద్ అలీ, నాయకులు ఎస్పీ బాబయ్య, అంతిగారి సురేందర్‌కుమార్, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బేతు ప్రవీణ్‌కుమా ర్‌రెడ్డి, ఎంపీటీసీ సమ్మద్, కాంగ్రెస్ నాయకులు ఎర్రగడ్డపల్లి కృష్ణ, వార్ల రవీంద్రా, మండల కోఅప్షన్‌సభ్యులు మునీర్, పరిగి మాజీ ఉప సర్పంచ్ బషీర్, వార్డు సభ్యులు అక్బర్, సర్వర్, మౌలానా, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి …
యాచారం: సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు.గురువారం విజయ దశమి రోజున యాచారం మండల పరిధిలోని తక్కళ్ళపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం నేటి నుండి ప్రతిష్ఠాత్మకం గా ప్రారంభిస్తున్న రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణానికి స్థానిక శాసన సభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి శంకు స్థాపన కార్యక్రమం చేపట్టారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగర్ ప్రధాన రహాదారి సమీపంలో అంద రికి ఆమోద యోగ్యంగ భూమిని సేకరించి ఇక్కడ నిర్మించే డబుల్ బెడ్‌రూం ఇండ్లు జిల్లాకే తలమానికంగా ఉంటాయ ని ఆయన పేర్కొన్నారు. తొలిసారిగా జిల్లాలోని ఆరు నియో జక వర్గాల్లో 5600ఇండ్ల నిర్మాణం చేపట్టను న్నట్లు, ప్రతి నియోజక వర్గానికి 400 ఇండ్ల చొప్పున నిర్మిం చి ఇవ్వను న్నట్లు ఆయన తెలిపారు. స్థానిక శాసన సభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ విజ యాలకు ప్రతీకైన విజయదశ మి రోజున ఈ కార్య క్రమం ప్రారంభించడం సంతోషించ దగ్గ విషయమని, దశలవారిగా ప్రతి అర్హునికి ఈపథకం ద్వార ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని ఆయన న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని పేర్కొన్నారు. కలెక్టర్ రఘునందన్‌రావు మాట్లాడుతూ ఇక్క డ సేకరించిన ఐదు ఎకరాల స్థలంలో నిజమైన లభ్దిదారు లను గుర్తించి ఒక్కొక్కరికి 125 గజాలలో డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రామావత్ జ్యోతి, జడ్‌పిటీసి కర్నాటి రమేష్‌గౌడ్,తహాశీల్థార్ వసంత కుమారి,ఎంపిడీవొ కె.ఉష,స్థానిక సర్పంచ్ కొండోజు భవాని,ఎంపిటీసి గడల మాధవి వివిద గ్రామాల ప్రజాప్రతినిధులు,మండలస్థాయి అధికారులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
తాండూరులో ప్రారంభించిన మంత్రి మహేందర్‌రెడ్డి …
తాండూరు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా చేపడుతున్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు పేదలైన అర్హులైనా వారికే మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం విజయదశమి పండుగను పురస్కరించుకుని తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలంలోని బెన్నూర్ గ్రామ పంచాయితీలో గల 2ఎకరాల స్థలంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మొదటి విడత కింద రాష్ట్రప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 400 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మం జూరు చేయడం జరిగిందన్నారు. 160 ఇండ్లు ఆర్బన్ ప్రాంతానికి, మిగతా 4మండలాలకు సర్దుబాటు చేయడం జరుగుతుందన్నారు. నిరుపేదలైనా వారికి మాప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వాల కంటే తెలంగాణ ప్రభుత్వం మెరుగైనా, నాణ్యమైనా ఇండ్ల ను నిర్మించి నిజమైన లభ్దిదారులను గుర్తించి ఎలాంటి అవి నీతి జరగకుండా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ద్వారా మం జూరు చేయడం జరుగుతుందని పేర్కోన్నారు. నిరు పేదలకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను నేరుగా వారికి చేరే విధంగా కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల మండల యంపీపీ సాయన్న గౌడ్, పిఎసిఎస్ సిద్రాల శ్రీనివాస్, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, స్థానిక సర్పంచు శమంతమ్మ, సబ్‌కలెక్టర్ అలుగు వర్షిణి, తహసీల్దార్ గోవింద్‌రావు, యంపిడిఓ భాగ్యవర్దన్, టిఆర్‌ఎస్ నాయకులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.