Home తాజా వార్తలు డబుల్ బెడ్ రూం ఇండ్లు దేశానికే ఆదర్శం…

డబుల్ బెడ్ రూం ఇండ్లు దేశానికే ఆదర్శం…

Double Bedroom Houses

 

బోధన్: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తున్న పక్క గృహాలు దేశానికి ఆదర్శమని శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న పక్క గృహాలను ఆయన పరిశీలించారు. డబుల్‌బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల కంటే వ్యక్తిగత ఇండ్ల నిర్మాణాలకు ప్రజలు మొగ్గు చూపడంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత ఇండ్లను మంజూరు చేయించి రూ.5లక్షల 4వేల తో ఉచితంగా మంజూరు చేసిందన్నారు. విడతల వారిగా లబ్దిదారుల ఖాతాలలో ప్రభుత్వం డబ్బులు జమచేస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఇంటి నిర్మాణాలలో ప్రభుత్వం పారదర్శికంగా వ్యవహరిస్తుందని స్పీకర్ వెల్లడించారు. పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఆయన వెల్లడించారు. బొప్పాపూర్ గ్రామంలో ప్రస్తుతం 30ఇండ్లు మంజూరు చేయడంతో నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. బాన్సువాడ నియోజకవర్గం పక్క గృహాల నిర్మాణాలలో రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా నిలుస్తుందన్నారు. అవసరమైతే మరిన్ని ఇండ్లను మంజూరు చేస్తానని ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పీకర్ తెలిపారు. ఆయన వెంట వర్ని మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ నారోజి గంగారాం, రుద్రూర్ విండో చైర్మన్ పత్తి రాము, వర్ని మండల పరిషత్ ఉపాధ్యక్షులు సంజీవ్ రెడ్డి, మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ , టీఆర్‌ఎస్ నాయకులు బాపూజి లింగం తదితరులు ఉన్నారు.

Double Bedroom Houses are Ideal to the Country