Home తాజా వార్తలు అర్హులైన వారందరికీ ఇళ్లు : ఇంద్రకరణ్‌రెడ్డి

అర్హులైన వారందరికీ ఇళ్లు : ఇంద్రకరణ్‌రెడ్డి

INDRA-KARAN

హైదరాబాద్ : తెలంగాణలో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఇస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న ఉద్దేశంతోనే రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. గురువారం ఆయన శాసనసభలో మాట్లాడారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లపై సిబిసిఐడి నివేదిక, రాజీవ్ గృహకల్ప కింద పూర్తయిన ఇళ్లను అర్హులకు అందజేయడం తదితర అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఇళ్లను నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోనే లక్ష ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే 1,979 డబుల్ బెడ్‌రూం ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించామన్నారు. 8,717 రాజీవ్ స్వగృహ భవనాలు, రాజీవ్ గృహకల్ప 3,432, వాంబే హౌస్ 1,646 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, త్వరలోనే వీటిని లబ్ధిదారులకు అందజేస్తామని ఆయన చెప్పారు.ఇళ్ల నిర్మాణానికి ఇసుకును ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల అవినీతిలో సిబిసిఐడి నివేదిక ఇంరా రాలేదని , ఈ అంశంలో ఇప్పటికే చాలా మందిని అరెస్టు చేశామని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా సాగుతూ అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లను ఇచ్చే పథకాన్ని చేపట్టిందని ఆయన పేర్కొన్నారు.

Double bedroom houses for poor People