Wednesday, March 29, 2023

పైసా లేకుండా డబుల్ బెడ్‌రూం

- Advertisement -

rooms

*వచ్చే దసరా నాటికి నిర్మాణ పనులు పూర్తి
చేయాలని అధికారులకు ఆదేశం
*నియోజకవర్గంలో నాలుగు వేల డబుల్ బెడ్
రూం ఇళ్ల్ల నిర్మాణాలు
*రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి
ఈటెల రాజేందర్

మనతెలంగాణ/జమ్మికుంట: వచ్చే దసరా వరకు పేదింటి కల నెరవేర్చాలంటే డబుల్ బెడ్‌రూం ఇళ్ల్ల నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా అధికారులు దృష్టి సారించాలని,పేదవానికి పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మా ణం పూర్తి చేయించి ఇస్తామని రాష్ట్ర ఆర్థిక,పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం మం త్రి ఈటల రాజేందర్ పట్టణంలోని కస్తూర్బా పాఠశాల ఏరియాలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం నిర్మాణ పనులను మ ంత్రి ఆకస్మికంగా పరిశీలించారు.240ఇండ్ల నిర్మాణ పను లు జరుగుతుండగా మంత్రి స్వయంగా పరిశీలించి నాణ్యతగా చేస్తున్నారా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అధికారులను,కాంట్రాక్టర్‌ను అడిగితెలుసుకున్నారు.నాణ్యత లో రాజీ పడవద్దని ఏమైనా డబ్బులు తక్కువ బడితే నా సొ ంత పైసలు కూడా ఇస్తానని అన్నారు.ఇళ్ల నిర్మాణ ప నులు చూసిన మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇండ్ల నిర్మాణ పనులు స్థానిక నాయకులు దగ్గరుండి చూసుకోవాలని నాణ్యతలో తేడా వస్తే సహించేది లేదన్నా రు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడు తూ నిరుపేదలకు మాత్రమే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని ఎక్కడా రాజీపడేది లేదన్నారు. ఎవరైనా బ్రోకర్లు వచ్చి ఇండ్లు ఇప్తిస్తామని చెప్పి డబ్బులు అడిగితే ఇవ్వద్దన్నారు. నిరుపేదలు ఎందరు ఉన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.ఇండ్ల నిర్మాణం అతిఖరీదైన పద్దతిలో ఎక్కడ లేని వి ధంగా కట్టిస్తున్నామని ప్రైవేట్ బిల్డర్స్ అయితే ఒక్కోక్క ప్లా ట్ ఖరీదు 30లక్షల వరకు ఉంటుందన్నారు. నియోజకవర్గంలో నాలుగు వేల డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాల కో సం ఇ ప్పటికే టెండర్లు పూర్తి చేశామని తెలిపారు. 2వేల ఇ ండ్ల నిర్మాణ పనులు ప్రారంభమైయ్యాయని వారం రో జుల్లో మరిన్ని ఇండ్లకు పూజలు చేసి పనులు ప్రారంభించబోతున్నామని తెలిపారు.పంచముఖ ఆంజనేయ ఆలయం ఏరియాలో మరో 260ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి స్పష్టం చేశారు.గత కాంగ్రేస్ పాలనలో తంతే కూలి పోయే గొడలు తుప్పుపట్టిన తలుపులు ఎప్పు డు కూలిపోతయే తెలియని పరిస్థితి ఉండేదన్నారు.అలాంటి పరిస్థితి రాకుడదనే పేదవానికి మంచి ఇల్లు గొప్పగా కట్టించి గృహ ప్రవేశాల ఖర్చు తమే భరిస్తామని మంత్రి అన్నారు. దసరా లోపు ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు.రెండవ పంట కడుపునిండ పండించుకోని రైతులు సంతోషంగా ఉండాలనే సంకల్పంతో మంజీరా నుం డి నీరు తీసుకవచ్చి ఎస్‌ఆర్‌ఎస్‌పి ద్వారా పంటలకు నీరు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.రైతు పంటపోలాలకు నీరు వృదా చేయకుండ మంచి పంటలు పండించాలని ఆయన కోరారు.అంతకు ము ందు మంత్రి ఇటీవల మోత్కులగూడెంలో మృతి చెందిన మాజీ ఎంపిటిసి యేబూసి ప్రభాకర్ కుటుంబాన్ని పరమర్శించారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఆర్డీఓ చెన్నయ్య సహకార సంఘాల యూనియన్ అద్యక్షులు తక్కళ్ళపెల్లి రాజేశ్వర్‌రావు నగరపంచాయతి చైర్మ న్ పోడేటి రామస్వామి మార్కెట్ చైర్మన్ పింగిళి రమేష్ నగరపంచాయతి వైస్ చైర్మన్ బచ్చు శివశంకర్ మార్కెట్ వైస్ చైర్మన్ ఎర్రబెల్లి రా జేశ్వర్‌రావు కౌన్సిలర్లు శ్రీలం శ్రీనివాస్ చంద రాజు దయ్యాల శ్రీనివాస్ నాయకులు పొనగంటి మల్లయ్య టంగూటూరి రాజ్‌కుమార్ త దితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News