Friday, March 31, 2023

డబుల్ అడుగులు

- Advertisement -

etela

*మూడు గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంఖు స్థాపనలు
*మరో వారంలో మరో నాలుగు గ్రామాలు
*నెరవేరనున్న పేదోడి స్వంతింటి కల
*నిరుపేదలకు రెండు పడక గదులే లక్షంగా మంత్రి ఈటల

మన తెలంగాణ/కమలాపూర్ : కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణాలకు అడుగులు పడ్డాయి. పేదోడికి స్వంతింటి కలను సాకారం చేయాలనే ఆలోచనతో ఆర్ధిక మంత్రి ఈటల ముందుకు సాగుతూ పక్కా ప్లాన్‌తో డబుల్ బెడ్ రూం ఇళ్లకు గ్రామాల వారీగా ప్రతిపాదనలు సిద్దం చేస్తూ శంకుస్థాపనలు చేస్తున్నారు. మండలంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళకు అంకురార్పణ పడటంతో మండలంలోని నిరుపేదలు సంతోషం వ్యక్తం చేస్తుండగా మరికొన్ని గ్రామాలకు డబుల్ బెడ్ రూం లక్ష్మీ త్వరలోనే తలుపు తట్టనుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల్లో కమలాపూర్ ప్రగతి పథంలో దూసుకుపోనుంది. కమలాపూర్ మండలానికి 20 గ్రామ పంచాయితీలు ఉండగా ప్రతి గ్రామంలోని నిరుపేదలు డబుల్ బెడ్ రూం ఇళ్ళ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో డబుల్ ఇళ్ళ నిర్మాణాలకు ఎప్పుడో పునాదులు పడ్డప్పటికీ హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు గుర్తించి ప్రతిపాదనలు పంపడంలో జాప్యం మూలంగా డబుల్ ఇళ్ల నిర్మాణాలకు ఆలస్యం అవగా అధికారి పార్టీ నాయకులకు పేదల నుండి కొంత ఇబ్బందులు తప్పలేదు. ఎట్టకేలకు మంత్రి ఈటల డబుల్ ఇళ్ల నిర్మాణాలను సీరియస్‌గా తీసుకుని అన్ని మండలాల్లో ప్రభుత్వ భూములను త్వరితగతిన గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఆ దిశగా ప్రభుత్వ భూముల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు సిద్ధ్దమైన శంకుస్థాపనలు చేస్తూ గ్రామాల్లో డబుల్ కళను తీసుకు వస్తున్నాడు. నిరుపేదలకు రెండు పడకల గదులను నిర్మించాలనే సంకల్పంతో కార్యాచరణ రూపొందించి ప్రభుత్వ భూములు ఉన్న గ్రామాల్లో శంకుస్థాపనలు చేస్తూ పనులను గుత్తేదారులకు అప్పగిస్తున్నారు. అనుకున్న సమయానికి నిర్మాణాలు పూర్తవ్వాలని గుత్తెదారులకు తెలుపుతూ ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్ రూం నిర్మిస్తామని హామీ ఇస్తున్నారు మంత్రి ఈటల. అందులో భాగంగానే కమలాపూర్ మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 895 ప్రభుత్వ భూమిలో 60, గూడూర్ గ్రామ శివారుల్లోని 143 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో 40 రెండు పడకల గదుల నిర్మాణాలకు మంత్రి ఈటల రాజేందర్ గత నెల 4న పునాదులు వేసారు. తదనంతరం మర్రిపెల్లిగూడెం గ్రామంలోని బిసీ కాలనీలో 30, ఎస్సీ కాలనీలో 30 రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాలకు మంత్రి ఈటల శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ నాలుగు గ్రామాల్లో సమస్యల మూలంగా రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు పంపడంలో ఆలస్యం తలెత్తుతోంది. దీంతో పంగిడిపెల్లి, వంగపెల్లి, కన్నూర్, అంబాల గ్రామాల్లో రెం డు పడకల గదుల నిర్మాణాలకు కొంత జాప్యం జరుగుతుండటంతో స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి స్థానిక సమస్యలను చక్కబెడుతుండటంతో రెండు పడకల గదుల నిర్మాణాలకు పచ్చ జెండా ఊపినట్లే, దీంతో నాలుగు గ్రామాల్లో వారం, పది రోజుల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు మంత్రి ఈటల చేతుల మీదుగా పునాదులు పడే అస్కారం ఉంది. కన్నూ ర్‌కు-40, పంగిడిపెల్లి-31, వంగపెల్లి-50, అంబాలకు-50 డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరి అయ్యే అవకాశాలుండగా మిగితా నిరుపేదలకు రెండో దశ నిర్మాణాల్లో ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇక ప్రభుత్వ భూ ములు లేకుండా డబుల్ బెడ్ రూం ఇళ్ళ కోసం ఆరాటపడుతున్న గ్రామాల్లో ప్రైవేట్ భూములును కొనుగోలు చేసైనా ఇళ్ల నిర్మాణాలు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు స్థానిక ప్రజా ప్రతినిధులు తెలుపుతున్నారు. వాటికి కొంత సమయం పడే అవకాశాలు ఉండగా ఇదే సమయంలో శంఖు స్థాపనలు జరిగిన గ్రామాల్లో పనులు ప్రారంభమై నిర్మాణాలు ఊపందుకొన్నాయి.
ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్ రూం ఇళ్లు : ఎంపీపి లక్ష్మన్ రావు
ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇవ్వాలనే ఆశయంతో మంత్రి ఈటల ముందుకు సాగుతున్నాడని, మండలంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణాల్లో ప్రజలు ప్రజా ప్రతినిధులకు సహకరిస్తూ నిర్మాణాలు చేసుకోవాలన్నారు. మొదటి దశ లో ఎంపిక కాని వారు నిరాశపడొద్దని రెండో జాబితాలో కూడా నిరు పేదలకే ప్రాధాన్యత ఉంటుందని, మరో కొద్ది నెలల్లోనే కమలాపూర్ మండలంలోని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల కలలు మంత్రి ఈటలతో సాకారం కానున్నాయని ఆశాభావం వ్యక్తం చేసారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News