Home Default డా.రెడ్డీస్ లాభం రూ.570 కోట్లు

డా.రెడ్డీస్ లాభం రూ.570 కోట్లు

Dr Reddy's Laboratories Q1 profit falls 13 percent

 

గతేడాదితో పోలిస్తే క్యూ1 లాభం 13% డౌన్

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి త్రైమాసిక ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన డా.రెడ్డీస్ నికర లాభం 12.59 శాతం క్షీణించి రూ.579 కోట్లు నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయం లో సంస్థ లాభం రూ.663 కోట్లుగా ఉంది. అయినప్పటికీ విశ్లేషకుల అంచనాలను కంపెనీ అధిగమించింది. కాన్సాలిడేటెడ్ ఆదాయం రూ.4,417.50 కోట్లతో 15 శాతం పెరిగింది. డా.రెడ్డీస్ కొచైర్మన్, ఎండి జివి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుత త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అన్ని విధాలుగా పటిష్టంగా ఉన్నాయని అన్నారు.

‘మేము పేషెంట్లకు మంచి సేవలను అందించగలిగాం, కష్ట సమయాల్లోనూ వ్యాపార నిర్వహణ కొనసాగించాం’ అని ఆయన అన్నారు. గతేడాదిలో రూ.187 కోట్లతో పోలిస్తే ఈసారి కంపెనీ ఆదాయం పన్ను రూ.300 కోట్లు చెల్లించింది. అంటే దాదాపు 60 శాతం ఎక్కువగా చెల్లించింది. ఫలితాల నేపథ్యంలో నిఫ్టీలో కంపెనీ స్టాక్ విలువ 6 శాతం పెరిగి రూ.4,305 వద్ద స్థిరపడింది.

Dr Reddy’s Laboratories Q1 profit falls 13 percent