Home తాజా వార్తలు ఏ క్షణంలోనైన ఒమిక్రాన్‌ దేశంలోకి రావచ్చు

ఏ క్షణంలోనైన ఒమిక్రాన్‌ దేశంలోకి రావచ్చు

Dr srinivas rao to talk new covid-19 variant omicron

 

హైదరాబాద్ : ఏ క్షణంలోనైన ఒమిక్రాన్ భారత్ లోకి రావచ్చని రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ వైద్యులు డిహెచ్ శ్రీనివాస రావు పేర్కొన్నారు. నిన్న జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కొవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం, ఒమిక్రాన్ పై ప్రజల్లో అవగాహన కల్పించడంపై చర్చించినట్టు వెల్లడించారు. యుకె, సింగపూర్ నుంచి నిన్న హైదరాబాద్ కు వచ్చిన ప్రయాణికులకు ఆర్టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించారు. వారికి చేసిన పరీక్షల్లో ఓ మహిళకు పాజిటివ్ వచ్చిందని టిమ్స్ లో చికిత్స అందిస్తున్నామని ఆయన చెప్పారు. బాధితురాలి నమూనాలు జీనోవ్ స్వీక్వెన్సీకి పంపించామని, నివేదిక వచ్చాక ఒమిక్రానా కాదా అనేది తెలుస్తుందని డిహెచ్ వివరించారు.

టికాను తప్పనిసారి చేసేందుకు ప్రయాత్నిస్తున్నామని డాక్టర్ శ్రీనివాస రావు, టీకా మాత్రవే ప్రాణాలను కాపాడుతుందని పేర్కొన్నారు. ఒమిక్రాన్ 25 దేశాలకు వ్యాపించింది. ఏ క్షణంలోనైన ఓమిక్రాన్ భారత్ లోకి రావచ్చని డిహెచ్ శ్రీనివాస రావు తెలిపారు.  టీకా తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. కొవిడ్ నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాల్పిందే అని సూచించారు. సిఎం కెసిఆర్ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారని, డెల్టా కంటే ఒమిక్రాన్ ఆరు రెట్లు వేగంగా వ్యాపిస్తుందని తెలిపారు. విద్యాసంస్థల్లో పలువురికి కరోనా పాటిజివ్ వస్తోంది. కరోనా ఇంకా పూర్తిగా అంతం కాలేదని ఆయన వెల్లడించారు.